శరవేగంగా భూ సర్వే
ఖిలా వరంగల్ : మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూ సర్వేకు రైతుల సైతం సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధుల విడుదల చేసింది. కలెక్టర్ ఆదేశాలతో గురువారం తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నక్కలపల్లి, గాడిపల్లి గ్రామ శివారులో శరవేగంగా భూ సేకరణకు సర్వే చేపట్టారు. రైతుల సహకారంతో తొలిరోజు 170 ఎకరాల భూ సర్వే చేసి హద్దులు గుర్తించారు. అనంతరం భూ నిర్వాసితుల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల సహకారంతో తొలిరోజు నక్కలపల్లి–47, గాడిపల్లి శివారు పరిధిలో 123, మొత్తం 170 ఎకరాలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన 8 3 ఎకరాల భూమి మరో మూడ్రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు త హసీల్దార్ తెలిపారు. అనంతరం సర్వేకు సహకరించిన రైతులకు తహసీల్దార్ నాగేశ్వర్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వేలో ఆర్‌ఐ ఆనంద్‌కుమార్, సర్వేయర్ రజిత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
సర్వేకు రైతుల సుముఖత
ఎయిర్ పోర్ట్ రన్‌వేకు 253 ఎకరాలు సేకరణ
Comments
Please login to add a commentAdd a comment