
బతకడం కష్టంగా ఉంది..
హన్మకొండ అర్బన్: ‘భర్త మరణం తర్వాత నన్ను పోషిస్తారనే ఆశతో నాకున్న 26 గుంటల వ్యవసాయ భూమిని మనుమలు దాట్ల ప్రవీణ్, రాజ్‌కుమార్ పేరు మీద పట్టా చేయించిన. ప్రవీణ్ చనిపోవడంతో అతడి భార్య నా బాగోగులు చూడట్లేదు. దీంతో నాకు బతకడం కష్టంగా మారింది. ఆస్తి లేనందున నన్నెవరూ పట్టించుకోవట్లేదు. ప్రవీణ్ భార్య.. భూమిని అమ్మేందుకు ప్రయత్ని స్తోంది. మొత్తం 26 గుంటల భూమిని మళ్లీ నా పేరు మీదికి చేయిస్తే ప్రశాంతంగా గడుపుతా. నన్ను సాకిన వారికి ఆస్తి ఇస్తా.. అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్‌కు మొర పెట్టుకుంది భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెంది న వృద్ధురాలు దాట్ల దుర్గమ్మ. ఇలా.. ఒక్కొక్కరు ఒ క్కో సమస్యపై కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి..
ప్రజావాణి వినతుల పరిష్కారానికి జిల్లా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, వినతులు పెండింగ్‌లో ఉంచవద్దని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై వినతులు స్వీకరించారు. మొత్తం 114 వినతులు అధికారులకు అందగా.. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ గణేశ్, ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రమేశ్, డీఆర్డీఓ మేనశ్రీను తదిరుతలు ఉన్నారు.
రోడ్డు కబ్జా చేస్తున్నారు..
హనుమకొండ 49వ డివిజన్‌లో కొందరు వ్యక్తులు రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి పనులు చేస్తున్నారు. ఈవిషయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.
– జనార్దన్, పోస్టల్ కాలనీ
వినడం..తీసుకోవడమే..
వరంగల్ గ్రీవెన్స్‌లో 103 వినతులు
వరంగల్: వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడం తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు వాపోతున్నారు.
పెండింగ్ లేకుండా చూడాలి: వరంగల్ కలెక్టర్
సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో అందిస్తున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 103 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై 53 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
న్యాయం చేయాలి..
పైడిపల్లి గ్రామంలో మా తల్లి చిలుక కాంత పేరున ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకున్నాం. ఆ ఇంటిని అన్న చిలుక బాబు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. మా వదిన భాగ్య ఇళ్లు నిర్మించుకోకుండానే తప్పుడు పత్రాలతో బిల్లులు తీసుకుంది. మాకు ఉన్న రెండు ఇళ్లు, ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలి.
– చిలుక సుధాకర్, పైడిపల్లి, వరంగల్
దరఖాస్తు రిజెక్ట్ చేశారు..
ఇందిరమ్మ ఇంటి కోసం దరఖా స్తు పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యింది. ఆన్‌లైన్‌లో చూస్తే మూడో విడతలో మంజూరు చేసిన జాబితాలో పేరు వచ్చింది. కానీ రిజెక్ట్ అయిందని రిమార్కులో పేర్కొన్నారు. కారణం ఏంటని పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగి అని ఉంది. నేను అవుట్ సోర్సింగ్ స్వచ్ఛభారత్ ఆటోను నడుపుతా. ప్రభుత్వ ఉద్యోగిని కాదు. రిమార్క్‌ను తొలగించి ఇల్లు మంజూరు చేయాలి. – నాగార్జున, కరీమాబాద్
ఆస్తి లేనందున నన్నెవరూ పోషించట్లేదు..
నా భూమి నాకు ఇప్పించండి..
ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్యకు
వృద్ధురాలి మొర..
114 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

బతకడం కష్టంగా ఉంది..

బతకడం కష్టంగా ఉంది..

బతకడం కష్టంగా ఉంది..

బతకడం కష్టంగా ఉంది..

బతకడం కష్టంగా ఉంది..
Comments
Please login to add a commentAdd a comment