పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్: మద్యం మత్తులో అతి వేగంగా కారులో దూసుకెళుతూ కారును కంట్రోల్ చేయలేక పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా, గడి గ్రామానికి చెందిన ఫిర్దోస్ సాదిక్ అలీ ఆదివారం రాత్రి కారులో తన స్నేహితులు అస్మత్, షాబాద్‌తో కలిసి మద్యం సేవించాడు.
అనంతరం వారు కారులో జూబ్లీహిల్స్ రోడ్ నెం 70 డీకే నగర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ప్లాట్ నెం 179లోని పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బోర్‌వెల్‌ను ఢీకొట్టడంతో బోర్‌వెల్ ధ్వంసమైంది. అదే సమయంలో సమీపంలో నిద్రిస్తున్న వాచ్‌మెన్ రవి పక్కకు జరిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి వారు మద్యం సేవించినట్లుగా నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment