హిమాయత్‌నగర్: ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రెండు ఖాతాలకు సంబంధించి నగర సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ చాంద్‌పాషా నేతత్వంలోని బృదం రెండు నకిలీ ఖాతాలను తొలగించింది.
విచారణ క్రమంలో మరో నాలుగు నకిలీ ఖాతాలను గుర్తించారు. ఇందులో ఒక ఖాతాలో సైబర్‌నేరగాళ్లు డబ్బులు కావాలంటూ పెట్టిన మేసేజ్‌కు స్పందించి ఒకరు రూ.80 వేలు బదిలీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలలోని సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారులు, ఇతర ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, డబ్బు అవసరముందంటూ మేసేజ్‌లు పెడుతుంటారు. అధికారుల పేర్లతో ఎవరైనా డబ్బులు అడిగితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment