పోలీస్ అకాడమీలో చైల్డ్ కేర్ సెంటర్ ప్రారంభం
బండ్లగూడ: తెలంగాణ పోలీస్ అకాడమీలో చైల్డ్ కేర్ సెంటర్‌ను గురువారం అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ప్రారంభించారు. అకాడమీలో పని చేస్తున్న మహిళలు, అకాడమీ సిబ్బంది పిల్లలకు ఉపయోగపడే విధంగా, అమినిటీస్ బ్లాక్‌లో ఈ సదుపాయాన్ని కల్పించారు. రెండు నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలు ఆడుకునేందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ కేబిన్స్, ఏఎస్‌ఐ ప్రీ ప్రమోషనల్ ట్రైనీలకు ఐ చెకప్ క్యాంప్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ మాట్లాడుతూ అకాడమీ సిబ్బందిపై పని భారాన్ని తగ్గించడంతో పాటు ప్రశాంతంగా కుటుంబ బాధ్యతలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మినిస్టీరియల్ సిబ్బంది పని చేయడానికి అనుకూలంగా ఉండేందుకు నూతన క్యాబిన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేడీ మురళీధర్, డీడీలు ఎన్.వెంకటేశ్వర్లు, పి.శ్రీరామమూర్తి, సునీతమోహన్, సి.నర్మద, అడిషనల్ డైరెక్టర్స్, డీఎస్‌పీలు, ఆర్‌ఐలు, అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment