No Headline
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ జాతీయ నూతన విద్యా విధానం– 2020లో భాగంగా వన్ నేషన్– వన్ స్టూడెంట్ ఐడీ పేరిట తెచ్చిన ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నమోదులో సమస్యలతో కష్టాలు తప్పడం లేదు. ఆధార్ కార్డులో వివరాల తప్పుల తడకగా ఉండటంతో ప్రధాన సమస్య గా తయారైంది. ఆధార్ తరహాలో విద్యార్థుల అకడమిక్ వివరాలతో పాటు వారి ధ్రువీకరణ పత్రాలను డిజిటల్‌గా భద్రపరిచేలా 12 అంకెలతో కూడిన అపార్ కార్డుకు రూపకల్పన చేశారు. విద్యార్థుల వివరాలు అడ్మిషన్ రిజిస్ట్రేషన్‌తో పాటు యూడైస్‌లో నమోదైన అనంతరం సంబంధిత కోడ్ ఆధారంగా విద్యార్థి సమగ్ర వివరాలన్నీ వస్తాయి. అపార్ నమోదు సమయంలో ఆధార్‌ను వినియోగించడం, అందులో వివరాలు తప్పుగా ఉండడంతో సమస్యలు తలెత్తుతు న్నా యి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్‌లతో వేర్వేరుగా ఉండడంతో సమ స్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 10 లోగా సమగ్ర వివరాలు సమర్పించాలంటూ విద్యాసంస్థలు నోటీసులు, మొబైల్ నంబర్లకు సందేశాలు పంపిస్తుండటంతో తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌లలో తప్పులను సరి చేసుకునేందుకు ఆధార్ సెంటర్లకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
అపార్ కార్డు కీలకం..
● సాధారణంగా విద్యార్థుల వివరాలు, పాఠశాల రికార్డులో ఒకలా, ఆధార్ కార్డులో మరోలా ఉంటాయి. కేంద్రం జారీ చేస్తున్న అపార్ కార్డులో విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు అందులో నమోదై ఉంటాయి. ఒకసారి అపార్ కార్డు ఇస్తే విద్యార్థి చదువు పూరై, ఉద్యోగం సాధించే వరకు ఇదే నంబర్ కార్డు ఉంటుంది. శాశ్వత డిజిటల్ గుర్తింపు సంఖ్యతో దేశంలో ఎక్కడ చదవాలన్నా ఉపాధి అవకాశాలకు సంబంధించి ఈ కార్డు కీలకం కానుంది.
● ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ.. దీనినే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డు అని కూడా పిలుస్తారు. పేరు, పుట్టిన తేదీ జెండర్, ఫొటో, క్యూఆర్ కోడ్, ఆధార్, 12 అంకెల గుర్తింపు నంబరు, విద్యార్థి మార్కులు, ఉపకార వేతనం, వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలన్నీ అపార్ డిజిటల్ కార్డులో భద్రంగా ఉంటాయి. స్కాన్ చేస్తే మొత్తం వివరాలన్నీ తెలుసుకునేలా అపార్‌ను రూపొందించారు.
పర్మనెంట్ ఐడీ..
అపార్ ఐడీ కార్డు జీవిత కాల ఐడీ నంబర్. ఈ కార్డు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, విజయాలను నమోదు చేయడంతో పాటు ట్రాక్ చేస్తుంది. అలాగే.. ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు బదిలీ కావడాన్ని సులభతరం చేస్తుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికీ స్కూల్స్, కాలేజీలు అపార్ కార్డును జారీ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment