ట్రాఫిక్ సెన్స్ ఎంతో అవసరం
అబిడ్స్: ట్రాఫిక్ అవగాహన, ట్రాఫిక్ సెన్స్ వాహనదారులకు మెండుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నుమాయిష్‌లో పోలీస్ స్టాల్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యారంగ వ్యాప్తికి నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తన చిన్నప్పటి నుంచి నుమాయిష్‌ను సందర్శించి ఎంతో ఉల్లాసంగా గడిపేవాడినని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..... చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్శంగా చుక్ చుక్ రైల్‌లో సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రయాణించారు. కార్యక్రమంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, వెంకటేశ్వర్లు, కవిత, అశోక్‌కుమార్, డీసీపీ రామ్‌దాస్ తేజ, ఏసీపీలు చంద్రశేఖర్, ధనలక్ష్మి, ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్, బాలాజీ, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, ప్రతినిధులు ఆర్.సుకేష్ రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
నుమాయిష్‌లో పోలీస్ స్టాల్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment