షేక్‌పేట్ ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం
గోల్కొండ: షేక్‌పేట్, డ్యిక్స్ ఎవెన్యూ భవనంలో కొనసాగుతున్న ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు, అగ్నిమాపక సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఇనిస్టిట్యూట్ కిటికీల్లో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లిహిల్స్, మాదాపూర్, లంగర్‌హౌస్ ఫైర్ స్టేషన్‌లకు చెందిన అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్‌లో కొనసాగుతున్న రిలయన్స్ ట్రెండ్స్‌లోకి కూడా మంటలు వ్యాపించాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భవనం లోనుంచి మంటలు రావడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిబూడిదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment