సాధారణంగా సదరు ఎస్సైని తీసుకురావడానికి, దింపడానికి అధికారిక వాహనాన్ని డ్రైవర్ తీసుకువెళ్తుంటారు. ఆయన ఇంటి వద్దకు చేరుకున్న ప్రతిసారీ డ్రైవర్ కాస్తా ముందుకు వెళ్లి రోడ్డు డెడ్ ఎండ్ వద్ద రివర్స్ చేసుకుని మళ్లీ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లేవారు. అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ జరిగిన గత గురువారం రాత్రి కూడా ఇలానే చేసి ఉంటే... ట్రాలీల్లో ఉన్న డబ్బును బ్యాగుల్లోకి మారుస్తున్న దుండగులపై ఆ వాహనం లైట్లు పడేవి. దీంతో వారు అక్కడే చిక్కే అవకాశం ఉండేది. అయితే ఆ రోజు ఎస్సై కంగారులో ఉండటంతో తాను లోపలకు వెళ్లి ఆయుధం తెచ్చుకునే లోపే... వాహనం వెనక్కు తిప్పి ఉంచాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించారు. దీంతో సదరు డ్రైవర్ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న చిన్న సందును ఆధారంగా చేసుకుని, అక్కడే రివర్స్ చేసి సిద్ధంగా ఉంచారు. ఈ కారణంగా ఆ సమీపంలోనే ఉన్న దుండగులపై వీరి దృష్టి పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment