నగదు సర్దుకోవడం పూర్తయిన తర్వాత ట్రాలీ బ్యాగుల్ని అక్కడే వదిలేసి కొంత దూరం వెళ్లిన దుండగులు చెట్ల చాటున తమ దుస్తులు సైతం మార్చుకున్నారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా బోయిన్‌పల్లి వైపు వచ్చి... అక్కడ ఆటో మాట్లాడుకుని శామీర్‌పేట వెళ్లారు. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో గజ్వేల్‌కు, ఆపై లారీలో ఆదిలాబాద్‌కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తమ ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యం చేయడానికి దుండగులు వాహనాలు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంతో పాటు బీదర్‌కు చెందిన పోలీసులు మహారాష్ట్ర, బీహార్‌లకు చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment