23 గ్రాముల కొకై న్, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
మాదాపూర్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇజ్జత్‌నగర్‌లోని అలేఖ్యహోమ్స్‌లో ఉంటున్న చంద్రపు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి బెంగళూరుకు చెందిన డ్రగ్స్ విక్రేత కెవిన్‌తో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను గురువారం ప్రసన్నకుమార్ రెడ్డికి డ్రగ్స్ అందజేసేందుకు మాదాపూర్‌లోని హైటెక్స్ మెటల్ చార్మినార్ వద్దకు వచ్చాడు. దీనిపై సమాచారం అందడంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పాల్వంచకు చెందిన జూపల్లి విశ్వామిత్ర, మణికొండకు చెందిన శ్రీనివాస సాయిదీపక్, సికింద్రాబాద్‌కు చెందిన వరుణ్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా కెవిన్ బెంగళూరులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడని, ప్రస్తుతం హైదరాబాద్‌లో మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలతో పాటు, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడి అరెస్ట్
మాదాపూర్: డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్‌లోని జేఎంజే కోలివింగ్ పీజీ హాస్టల్‌లో ఉంటున్న గుత్తాతేజ కృష్ణ ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు. గురువారం అతను అయ్యప్ప సొసైటీ వద్ద బెంగళూరుకు చెందిన శాండీ అనే యువతి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు గుత్తా తేజకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ విక్రేత శాండి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తేజ నుంచి 11.14 గ్రాముల ఎండీఎంతో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment