రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఘట్‌కేసర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర మండలం జమిలాపేట్‌కు చెందిన మడిపడిగే యశ్వంత్ (18) ఇంటర్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి ఘట్‌కేసర్ వైపు స్కూటీపై వస్తుండగా అగస్త్య ఫామ్‌హౌజ్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన లారీ యశ్వంత్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యశ్వంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం పోయేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
యశ్వంత్ మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment