
ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి
టర్ పరిధిలోని కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట్, జూబ్లీహిల్స్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో ఇసుక, మట్టి తరలింపు, వ్యర్థాల తొలగింపు, నిర్వహణ వంటి విషయాల్లో నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాటి పరిసర ప్రాంతాల్లో ఇసుక రేణువులు గాలిలో దట్టంగా అలముకుంటున్నాయి. గాలిలో పీఎం 10 ధూళికణాల సాంద్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై బస్సు, లారీ, కారు వంటి వాహనాలు వెళ్లేటప్పుడు దారి కనిపించనంత దట్టంగా దుమ్ము రేగుతోంది. పటాన్‌చెరు, బొల్లారం, పాశమైలారం, రామచంద్రాపురం తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశమ్రలు విడుదల చేస్తున్న వ్యర్థాలు గాలి పీల్చుకోలేనంత గాఢంగా మారుతున్నాయి. నగరంలో సుమారు 80 లక్షల వాహనాలు నిత్యం రహదారిపై తిరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, కోఠి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో రహదారిపై ఒకవైపు పొగ, మరోవైపు ధూళి రేణువులు కళ్లల్లో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు జీహెచ్‌ఎంసీ రూ.వేల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ఆ దారిలో దుమ్మురేగుతోంది. గాఢమైన వాసనలు పీల్చడం, దుమ్ము, ధూళి రేణువుల ప్రభావంతో శ్వాసకోశ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
మియాపూర్‌లో ఆందోళనకరం
మియాపూర్‌లోని నరేన్ గార్డెన్‌లో ఎయిర్ క్వాలిటీ 342గా నమోదైంది. ఇక్కడ ఉన్న కొన్ని నిర్మాణ సంస్థలే ఇందుకు ప్రధాన కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గాలి నాణ్యత సోమాజిగూడ(154), కేపీహెచ్‌బీ ఫేజ్–3 (139), జూపార్క్ (124), కోటి (124), యూఎస్ కాన్సలేట్ (124) సైదాబాద్ (107) తదితర ప్రదేశాల్లో ప్రమాదకరంగా నమోదైంది. గాలి నాణ్యత 50 వరకు ఉంటే సాధారణం. 100 దాటితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
బయటకు వెళ్తే దుమ్ము, ధూళి.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి.. పరిశ్రమలు, నిర్మాణ సంస్థలున్న ప్రాంతాల్లో దట్టమైన పొగలు.. ఇదీ నగరంలో పరిస్థితి. స్వచ్ఛమైన గాలి మచ్చుకై నా లేదు. వాహనాల రద్దీకి గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోంది. కొన్ని ప్రాంతాల్లో ఘనపు మీటరు గాలిలో పీఎం10 ధూళికణాలు 60 మైక్రో గ్రాములు ఉండాల్సిన చోట 150 మైక్రో గ్రాములు దాటి నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు 60 మైక్రో గ్రాములు, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములు ఉండాలి. –సాక్షి, సిటీబ్యూరో
ప్రాంతం పీఎం 10 స్థాయి
(మైక్రో గ్రాములు)
పాశమైలారం 158
పటాన్‌చెరు 155
జూ పార్క్ 157
బొల్లారం 146
హెచ్‌సీయూ 135
కోకాపేట్ 120
సోమాజిగూడ 104
Comments
Please login to add a commentAdd a comment