
అడుగంటిన పబ్లిక్ గార్డెన్ చెరువు
ప్రశ్నార్థకంగా జలచరాల మనుగడ
నాంపల్లి: 150 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన నాంపల్లి పబ్లిక్ గార్డెన్ చెరువు అడుగంటింది. ఈ చెరువు ఎండిపోవడం పర్యావరణం సంక్షోభానికి సంకేతం. ఇన్నాళ్లూ జీవ వైవిధ్యానికి ఆధారంగా నిలిచిన పబ్లిక్‌గార్డెన్ చెరువు ఎండిపోవడానికి పట్టణీకరణ, భూగర్భ జలాలు అడుగంటడం, పేలవమైన పరిరక్షణ చర్యలే కారణాలని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన ప్రదేశం వినాశనానికి గురికావడంతో అందులోని జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో రెండురోజుల్లో పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. తాబేళ్లు, చేపలు మృత్యువాత పడే అవకాశం ఉంది. నీటిమట్టం తగ్గడంతో చెరువులోని చేపలు కొంగలకు ఆహారంగా మారాయి. కాబట్టి సంబంధిత శాఖ అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక దృష్టిని సారించి చెరువును, చెరువులోని జలచరాలను కాపాడాల్సిన అవసరం ఉంది. చెరువులోని పూడికను తొలగించి తక్షణం జల స్థిరతాన్ని తీసుకురావాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment