బ్రష్‌లు చేత పట్టి.. గోడలకు రంగులేసి..
ఉస్మానియా ఆసుపత్రిలో ఐటీ ఉద్యోగుల సామాజిక సేవ
అఫ్జల్‌గంజ్: నిత్యం కంప్యూటర్ కీ బోర్డుపై బిజీగా ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల చేతులు బ్రష్‌లను పట్టి ఉస్మానియా ఆసుపత్రి గోడలకు రంగులు అద్దాయి. ప్రతిరోజు పని ఒత్తిడితో సతమతమవుతూ వారాంతంలో సినిమా, విందు, వినోద కార్యక్రమాలతో సేద తీరే ఐటీ ఉద్యోగులు సామాజిక సేవలో తాము సైతం అంటూ పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వివిధ ఐటీ కంపెనీలకు చెందిన దాదాపు 50 మంది ఉద్యోగులు, ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో పేద రోగులకు సేవలందిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సహకారంతో ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కులీకుత్‌బ్ షా భవనంలోని పరిసరాలు, గోడలు, వార్డులను శ్రమదానంతో శుభ్రం చేశారు. బ్రష్‌లు చేతబట్టి సుమారు 100 లీటర్ల పెయింట్‌తో రంగులు వేశారు. పేద రోగులు వచ్చే ఉస్మానియా ఆసుపత్రికి తమ వంతుగా సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని విప్రో కేర్ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, ఆర్‌ఎంఓలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ మునావర్‌లు ఐటీ ఉ ద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో వాజీ ద్, భారతి, నేహ, ప్రీతి, ఆరిఫ్, తేజ, దివ్య, స్వర్ణ, కౌసల్య, ఉష, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment