వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యంలో రాజకీయం వేడెక్కుతోంది అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్లు పరస్పరం విమర్శల దాడికి దిగుతూ ప్రచార దూకుడు పెంచారు. ఈ క్రమంలో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యూయార్క్‌లోని ఓల్డ్ ఫోర్జ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. జో బిడెన్ గనుక అధికారంలోకి వస్తే ప్రజలకు అంతకన్నా పీడకల మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. ఆయనకు అధికారం కట్టబెడితే స్థానిక ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బిడెన్‌కు, తనకు మధ్య పోటీ తీవ్ర వామపక్ష భావజాల సమూహానికి, సొంత కుటుంబం కోసం పోరాడుతున్న వ్యక్తికి మధ్య పోరు వంటిదని అభివర్ణించారు.(ట్రంప్ అంతకుమించి ఏమీ చేయలేరు!)
ఇక బిడెన్ జన్మించిన స్క్రాంటన్ సమీపంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘‘ఆయన అసలు ఇక్కడ జన్మించలేదు. ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదు. మీ అందరికి తెలుసు. బిడెన్‌కు తొమ్మిది, పదేళ్ల వయస్సు ఉన్నపుడే అతడి తల్లిదండ్రులు డెలావర్‌కు మారిపోయారు. కానీ ఈనాటి రాత్రి జో తన ప్రసంగంలో తన స్వస్థలం గురించి ప్రస్తావించి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడి నుంచి పారిపోయిన వ్యక్తికి అలా మాట్లాడే అర్హత లేదు. గత యాభై ఏళ్లుగా వాషింగ్టన్‌లో సమయం గడుపుతూ దేశాన్ని అమ్ముకుంటూ.. మన ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టేలా చేస్తున్న వ్యక్తి బిడెన్’’అంటూ విరుచుకుపడ్డారు. (ట్రంప్ పాలనపై ఒబామా విమర్శలు)
కాగా జో బిడెన్‌తో పాటు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్య బరిలో నిలిచిన కమలా హారిస్‌పై కూడా ఇదే తరహా విమర్శలు చేశారు. కమల అమెరికాలో జన్మించలేదని.. ఆమెకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అర్హత లేదని ట్రంప్ విమర్శించారు. ఓ నల్లజాతి మహిళ అమెరికన్ల అవసరాలు తీర్చలేదని, అధికారంలోకి వస్తే ఆమె జో బిడెన్ కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తారంటూ జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment