ఒట్టావా: కెనడాలో హిందూ లక్షిత దాడులు మరోసారి జరిగాయి. సర్రేలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో ఇంటిపై 11 బుల్లెట్లు పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 27 ఉదయం 14900 బ్లాక్ 80 అవెన్యూలో కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిపిన నివాసం సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
కెనడాలో కొద్ది రోజులుగా హిందూ లక్షిత దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలే లక్ష‍్యంగా దుండగులు దాడులు చేస్తున్నారు. ఇటీవల సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఇటీవల దాడులు జరిగాయి. సర్రేలో ఖలిస్థానీల మద్దతుతో ర్యాలీలు కూడా వెలుగు చూశాయి. నిజ్జర్ హత్య కేసు తర్వాత ఈ దాడులు ఎక్కువయ్యాయి.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను సర్రేలోనే దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. గురుద్వాలో ఉన్న నిజ్జర్‌పై జులై 18న కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది కాస్త కెనడా- భారత్ మధ్య వివాదంగా మారింది.
ఇదీ చదవండి: ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
Comments
Please login to add a commentAdd a comment