Sakshi News home page

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఊరట: పోటీకి మార్గం సుగమం

Published Wed, Oct 25 2023 2:51 PM

Former Pakistan Prime Minister Nawaz Sharif gets bail in corruption cases - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు వచ్చే పాక్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం అయినట్లుగా కనిపిస్తోంది. గతంలో అల్‌-అజీజియా కేసులో ఆయనకు పడ్డ ఏడు సంవత్సరాల జైలు శిక్షను అక్కడి పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మరో మూడు అవినీతి కేసుల్లో రెండు ప్రత్యేక కోర్టులు ఆయనకు బెయిల్‌ మంజూరు చేశాయి.

బ్రిటన్‌లో నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం ఆయన తాజాగా స్వదేశం తిరిగి రావడం తెలిసిందే. ఏడాది ఎన్నికలలో నిలబడాలనేది ఆయన  లక్ష్యం. దీని వెనక సైన్యం మద్దతుందని వార్తలొచ్చాయి. అల్‌–జజీజియా కేసులో 2018లో నవాజ్‌ షరీఫ్‌కు ఏడేళ్ల శిక్ష పడింది. మూడేళ్ల జైలు జీవితం తర్వాత చికిత్స కోసమని లండన్‌ వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. దాంతో ఆయనను పారిపోయిన ఖైదీగా ప్రకటించారు.   

Advertisement

What’s your opinion

Advertisement