ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాక్ మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్‌తో సహా మరో 150 మందిపై పోలీసులు నమోదు చేశారు. దీంతో దేశంలో వీరి అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలోని మస్జిద్-ఎ-నబ్వీ వద్ద ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ సహా మరికొంత మంది నేతలు దొంగ, ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 295ఏ కింద ఇమ్రాన్‌తో సహా 150 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తాను ఎవరికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇక కేసు నమోదైన వారిలో మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షహబాజ్ గుల్, షేక్ రషీద్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: చైనా కంపెనీ షావోమీకి బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment