
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి తీవ్రత పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారులు మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. సమిష్టి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరణాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కరోనాను కట్టడి చేసేందుకు వాక్సిన్ అవసరంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సత్వర చర్యలు, వాక్సిన్ రాని పక్షంలో కరోనా మరణాల తీవ్రత పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు)
ఇప్పటికే పది లక్షల కోవిడ్ మరణాతకు చేరువయ్యామని, మరింత అప్రతమత్తం కాకుంటే ఈ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రమాదాన్ని ఊహించడానికే కష్టంగా ఉందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని సంబంధిత చర్యలు తీసుకోవాలని ర్యాన్ కోరారు. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 85,362 తాజా కేసులతో దేశంలో మొత్తం 59 లక్షలు దాటింది. 93 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి వల్ల 9.88 లక్షల మంది మృతిచెందగా, 3.25 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment