ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో పాశ్చాత్య దేశాల పాలిట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక విలన్. కానీ, అదే పుతిన్ పాపులారిటీ వీరలెవల్‌లో పెరగడానికి ఒక కారణం అయ్యింది. అంతేకాదు ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వదేశంలో మద్ధతు నానాటికీ పెరిగిపోతోంది కూడా.
రష్యాకు చెందిన ఇండిపెండెంట్ మీడియా ఏజెన్సీ లెవద సెంటర్.. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో 80 శాతంపైగా రష్యా ప్రజలు పుతిన్ చర్యలను సమర్థిస్తున్నారట. ఉక్రెయిన్‌పై ఆక్రమణ మొదలయ్యాక రష్యాలోనూ కొంత ప్రతికూలత పుతిన్‌కు ఎదురయ్యింది. కానీ..
ఈ నెల రోజుల పరిణామాలు.. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలు రష్యా పట్ల వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రజల్లో విపరీతమైన మార్పును తీసుకొచ్చిందని లెవద సెంటర్ వివరించింది. యుద్ధం మొదలైన మొదట్లో 27 శాతం రష్యా జనాభా పుతిన్‌చర్యలను వ్యతిరేకించారని, ఇప్పుడది 15 శాతానికి పడిపోయిందని ప్రత్యేకంగా పేర్కొంది. అంతేకాదు పుతిన్ పాపులారిటీ గ్లోబల్ వైడ్‌గా(పాశ్చాత్య దేశాలను మినహాయించి) పెరిగడానికి ఉక్రెయిన్ యుద్ధం ఒక కారణమైందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లెవద సెంటర్ నిర్వహించిన ప్రముఖ సర్వే ఇదే కావడం విశేషం.
రష్యా బలగాల గురించి, యుద్ధ పరిణామాల గురించి తప్పుడు వార్తలు, కథనాలు ప్రచురించే వాళ్లపై క్రిమినల్ కేసులు పెడుతోంది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. స్వతంత్ర్య మీడియా ఏజెన్సీగా పేరున్న లెవద సెంటర్ ఈ తరహా రిపోర్ట్ వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment