నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ.. | Viral Japan Theme Park Offers Screaming Stickers To Roller Coaster Ride | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఆ స్టిక్కర్‌ ధరిస్తే చాలు, బిగ్గరగా నవ్వినట్టే

Published Wed, Aug 5 2020 4:02 PM | Last Updated on Wed, Aug 5 2020 9:22 PM

Viral Japan Theme Park Offers Screaming Stickers To Roller Coaster Ride - Sakshi

టోక్యో: కరోనా లాక్‌డౌన్లు ముగిసి ప్రపంచమంతటా అన్‌లాక్‌లు షురూ అయ్యాయి. తాజాగా జపాన్‌లో పర్యాటక ప్రాంతాలు తెరుచుకుంటున్నాయి. మ్యూజియంలు, ఒపేరా హౌజ్‌, థీమ్స్‌ పార్కుల్లోకి సందర్శకులు ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోలర్‌ కోస్టర్‌లో రైడ్‌ చేసే పర్యాటకులు  బిగ్గరగా అరవొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, రోలర్‌ కోస్టర్‌లో ప్రయాణం చేసేటప్పుడు అత్యంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే టూరిస్టులు నిశ్శబ్దంగా ఉండటం కష్టమని భావించిన థీమ్‌ పార్క్‌ ఒకటి వినూత్నంగా ఆలోచించి ఓ పరిష్కారం కనుగొంది.

టూరిస్టులు ఫేస్‌ మాస్కుపైన స్క్రీమింగ్‌ స్టిక్కర్లు ధరించేలా ఏర్పాట్లు చేసింది. దాంతో రోలర్‌ కోస్టర్‌లో వెళ్లేటప్పుడు ఆ ఎగ్జయిట్‌మెంట్‌ మిస్‌ కాబోదని చెప్పింది. వీటిని ధరించడం ద్వారా పర్యాటకులు బిగ్గరగా నవ్వుతున్న (అరుస్తున్న) అనుభూతికి లోనవుతారని పేర్కొంది. తమ ఉద్యోగులతో తొలుత ఈ ప్రయోగం చేయగా విజయవంతమైందని థీమ్‌ పార్క్‌ను నిర్వహిస్తున్న గ్రీన్‌లాండ్‌ రిసార్ట్స్‌ యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. గట్టిగా నవ్వడంలో ఇదో నూతన విధానం అని పేర్కొంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement