మాస్కో: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ యద్ధంలో సేనలు రష్యా బలగాలను నియంత్రిస్తూ...పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున్న సైనిక బలగాలను సమీకరించి అంతుచూస్తానంటూ రష్యా అధ్యక్షుడు బహిరంగాగానే చెప్పారు. అందులో భాగంగానే ఈ యుద్ధ ట్యాంకులను అధిక సంఖ్యలో రంగంలోకి దింపుతోంది రష్యా.
వాస్తవానికి ఫిబ్రవరి 27న యద్ధ మొదలైనప్పటి నుంచి రష్యా దాదాపు రెండు వేలకు పైగా యుద్ధ ట్యాంకులను కోల్పోయింది. దీంతో రష్యా అత్యంత శక్తిమంతమమైన టీ 62 యుద్ధ ట్యాంకులను కథనం రంగంలోకి ప్రవేశ పెట్టనుంది. ఇవి ఆధునిక ఆయుధాలను సైతం నిలువరించగలదని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల ముఖ్య సలహదారు అంటోన్ గెరాష్చెంకో అన్నారు. ఈ ట్యాంకుతో రష్యా యుద్ధంలో మోరించి తమ పోరాట పటిమను చూపించుకోవాలని ఆరాటపడుతోందన్నారు.
అంతేకాదు బ్రిటీష్ మత్రిత్వశాఖ అలాంటి యుద్ధ ట్యాంకులు అత్యంత ప్రమాదకరమైనవని, ఆయుధాలను నియంత్రించగల సామర్థ్యంగలవి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఓడిపోతానన్న అనుమానం ప్రాంభమైన వెంటనే విధ్యంసకర దాడికైన దిగుతుందంటూ...ప్రపంచ దేశాలు వ్యక్తం చేసిన అనుమానాల్ని నిజం చేసేలా రష్యా వ్యూహం సిద్ధ చేసుకుంటోంది.
సోవియట్ యూనియన్ ఉత్పత్తి చేసిన చివరి మీడియం ట్యాంకులే ఈ యుద్ధ ట్యాంకులు. ఈ టీ 62 ట్యాంకులు సెమీ ఆటోమేటిక్ 115 ఎంఎం స్మూత్‌బోర్ గన్‌తో నిర్మితమైన ట్యాంకులు. పైగా ఆ ట్యాంకులకు సంబంధించిన వీడియోని కూడా ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Old Soviet tanks taken out of conservation by Russia - with no protection against modern weapons.
— Anton Gerashchenko (@Gerashchenko_en) September 23, 2022
And new Russian conscripts (also with no protection against modern weapons and a modern army - we've seen what they fight in).
Perfect combination, doomed for success, I would say. pic.twitter.com/Lh3tNLA0AE
(చదవండి: రష్యా దూకుడు...ఉక్రెయిన్ భూభాగాలపై రిఫరెండమ్ షురూ)
Comments
Please login to add a commentAdd a comment