tanks
-
ఆ ఒక్క జవాను.. పాక్ ఆశలను పటాపంచలు చేశాడు!
భారతదేశ వీర జవానులు యుద్ధభూమిలో ధైర్యసాహసాలకు ప్రతిబింబంగా నిలిచారు. 1965లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత సైనికుడు అబ్దుల్ హమీద్ చూపిన తెగువ మరువలేనిది. 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ వ్యూహం ద్వారా పాకిస్తాన్ భారత్‌పై దాడికి దిగింది. జమ్మూ కాశ్మీర్‌పై దాడి చేసి, అక్కడ తిరుగుబాటును సృష్టించి, కొన్ని సరిహద్దులను తెరవడం ద్వారా భారత సైన్యాన్ని చిక్కుల్లో పెట్టడం దీని లక్ష్యం. 1965 సెప్టెంబరు 8 న పాకిస్తాన్ సైన్యం ఖేమ్కరణ్ సెక్టార్‌లోని అసల్ ఉత్తాడ్ గ్రామంపై అమెరికన్ ప్యాటన్ ట్యాంకులతో దాడికి దిగింది. ఈ దాడుల సమయంలో హమీద్ పంజాబ్‌లోని తరన్తారణ్ జిల్లాలోని ఖేమ్ కరణ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. అసల్ ఉత్తాడ్పై ఈ దాడి హఠాత్తుగా జరిగింది. దీంతో అక్కడ మోహరించిన భారత సైనికులు దీనిని ఊహించలేకపోయారు. వారి వద్ద ట్యాంకులు,పెద్ద ఆయుధాలు అందుబాటులో లేవు. వారి దగ్గర తేలికపాటి మెషిన్ గన్లు మాత్రమే ఉన్నాయి. యాంటీ ట్యాంక్ డిటాచ్మెంట్ కమాండర్ లేకపోవడంతో, ట్యాంకుల నిర్వహణ బాధ్యతను హమీద్ తీసుకున్నారు. 1965 సెప్టెంబరు 8న హమీద్ పాక్‌కు చెందిన రెండు ట్యాంకులను ధ్వంసం చేశారు. నాలుగు ట్యాంకులను నిర్వీర్యం చేశారు. మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం సాబర్ జెట్ దాడులను ప్రారంభించింది. ఆ సమయంలోనూ హమీద్, అతని సహచరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించారు. సెప్టెంబర్ 10న అసర్ అసల్ ఉత్తాడ్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పాకిస్తాన్.. ప్యాటన్ ట్యాంకులతో కాల్పులకు తెగబడింది. ఈసారి హమీద్ మరో ట్యాంక్‌ను ధ్వంసం చేశారు. ఈ నేపధ్యంలో పాక్ సైనికులు జరిపిన దాడిలో హమీద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధంలో అమెరికా అందించిన ప్యాటన్ ట్యాంకులపై పాకిస్తాన్‌కు గట్టినమ్మకం ఉంది. 1965 యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన మొత్తం 165 ప్యాటన్ ట్యాంకులు ధ్వంసమయ్యాయని లేదా నిరుపయోగంగా మారాయని చెబుతారు. వాటిలో సగానికి పైగా ట్యాంకుటు ఖేమ్ కరణ్ సెక్టార్లోనే ధ్వంసమయ్యాయి. హమీద్ ధైర్యసాహసాలు ఈ యుద్ధంలో నిరూపితమయ్యాయి. భారత సైన్యానికి సత్తా చాటేందుకు పూర్తి అవకాశం లభించింది. పాకిస్తాన్ సైన్యం భారత సైన్యంతో పోరాడలేక తిరోగమించవలసి వచ్చింది. భారత సైన్యం చేతిలో పాక్ ట్యాంకులు ధ్వంసం కావడం ఆ దేశ సైన్యాన్ని నైతికంగా దెబ్బతీసింది. పాక్ వ్యూహం విఫలమవడంతో పాక్ ఆర్మీ ఖేమ్ కరణ్లోకి ప్రవేశించేందుకు సాహసించలేదు. భారత సైన్యం దృష్టిని మరల్చాలనే పాక్ వ్యూహం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా భారత సైన్యం ఈ యుద్ధంలో ఆధిపత్యం చెలాయించింది. భారత సైన్యం పాక్‌లోకి ప్రవేశించడంతో పాక్ ఓటమి చవిచూసింది. ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? -
ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
అదానీకి హిండెన్‌బర్గ్ షాక్, మరో బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ సృష్టించిన అలజడితో అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. తాజా డేటా ప్రకారం ఆసియా, భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్- గౌతం అదానీ సంపద శుక్రవారం మరింత పతన మైంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అతని ర్యాంకింగ్ శుక్రవారం ఏడో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని మొదటి ఐదుగురు సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు. 100 బిలియన్ డాలర్ల దిగువకు ఫోర్బ్స్ రియల్ టైమ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపద రోజులో 22.5 బిలియన్ల డాలర్లకు పైగా క్షీణించి 96.8 బిలియన్ల డాలర్లకు చేరింది. ఫలితంగా అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే దిగువ స్థానంలో ఉన్నారు. అదానీ షేర్ల భారీ ర్యాలీతో మొదట 2వ స్థానానికి చేరుకున్నారు గౌతం అదానీ. ఆ తరువాత చాలా కాలం పాటు 3వ స్థానంలో కొనసాగి, ఇటీవల నాలుగోప్లేస్కు దిగజారిన సంగతి తెలిసిందే. బిల్ అక్మాన్ వ్యాఖ్యలు అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హింబెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై బిలియనీర్, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్ అక్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక "అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడింది" అంటూ బిల్ అక్మాన్ ట్వీట్ చేశారు. హిండెన్‌బర్గ్ ఫారెన్సిక్ రీసెర్చ్ పూర్తి రిపోర్ట్ ఆధారంగానే, తప్ప తామెలాంటి ఇండిపెండెంట్ పరిశోధన చేయలేదంటూ అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అదానీ కంపెనీల్లో, లేదా హెర్బా లైఫ్‌లో తమకు ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఎఫ్‌పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) కు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రావడం గమనార్హం. నేటినుంచి( జనవరి 27) 31 వరకు నిర్వహించే ఎఫ్‌పీవోలో రూ.20 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. రూ. 3.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న అదానీ ఎంటర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైస్‌ను ధరను రూ.3,112 నుంచి రూ.3,276గా నిర్ణయించింది. -
కదన రంగంలోకి అత్యంత శక్తిమంతమైన రష్యా యుద్ధ ట్యాంకులు! షాక్‌లో ఉక్రెయిన్
మాస్కో: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ యద్ధంలో సేనలు రష్యా బలగాలను నియంత్రిస్తూ...పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున్న సైనిక బలగాలను సమీకరించి అంతుచూస్తానంటూ రష్యా అధ్యక్షుడు బహిరంగాగానే చెప్పారు. అందులో భాగంగానే ఈ యుద్ధ ట్యాంకులను అధిక సంఖ్యలో రంగంలోకి దింపుతోంది రష్యా. వాస్తవానికి ఫిబ్రవరి 27న యద్ధ మొదలైనప్పటి నుంచి రష్యా దాదాపు రెండు వేలకు పైగా యుద్ధ ట్యాంకులను కోల్పోయింది. దీంతో రష్యా అత్యంత శక్తిమంతమమైన టీ 62 యుద్ధ ట్యాంకులను కథనం రంగంలోకి ప్రవేశ పెట్టనుంది. ఇవి ఆధునిక ఆయుధాలను సైతం నిలువరించగలదని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల ముఖ్య సలహదారు అంటోన్ గెరాష్చెంకో అన్నారు. ఈ ట్యాంకుతో రష్యా యుద్ధంలో మోరించి తమ పోరాట పటిమను చూపించుకోవాలని ఆరాటపడుతోందన్నారు. అంతేకాదు బ్రిటీష్ మత్రిత్వశాఖ అలాంటి యుద్ధ ట్యాంకులు అత్యంత ప్రమాదకరమైనవని, ఆయుధాలను నియంత్రించగల సామర్థ్యంగలవి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఓడిపోతానన్న అనుమానం ప్రాంభమైన వెంటనే విధ్యంసకర దాడికైన దిగుతుందంటూ...ప్రపంచ దేశాలు వ్యక్తం చేసిన అనుమానాల్ని నిజం చేసేలా రష్యా వ్యూహం సిద్ధ చేసుకుంటోంది. సోవియట్ యూనియన్ ఉత్పత్తి చేసిన చివరి మీడియం ట్యాంకులే ఈ యుద్ధ ట్యాంకులు. ఈ టీ 62 ట్యాంకులు సెమీ ఆటోమేటిక్ 115 ఎంఎం స్మూత్‌బోర్ గన్‌తో నిర్మితమైన ట్యాంకులు. పైగా ఆ ట్యాంకులకు సంబంధించిన వీడియోని కూడా ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Old Soviet tanks taken out of conservation by Russia - with no protection against modern weapons. And new Russian conscripts (also with no protection against modern weapons and a modern army - we've seen what they fight in). Perfect combination, doomed for success, I would say. pic.twitter.com/Lh3tNLA0AE — Anton Gerashchenko (@Gerashchenko_en) September 23, 2022 (చదవండి: రష్యా దూకుడు...ఉక్రెయిన్ భూభాగాలపై రిఫరెండమ్ షురూ) -
జనాల మీదకు యుద్ధ ట్యాంకర్లు.. మళ్లీ మారణహోమం?!
బీజింగ్: చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను అరిగోస పెడుతున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో.. ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనుపోనూ ఈ నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు యద్ధ ట్యాంకర్లను రంగంలోకి దించించి జింగ్‌పిన్ సర్కార్. కొన్ని బ్యాంకులు ఏప్రిల్ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలుచోటు చేసుకుంటున్నాయి. బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవద్దనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 🚨🚨🚨🚨Breaking news🚨🚨🚨🚨 Tanks are being put on the streets in China to protect the banks. This is because the Henan branch of the Bank of China declaring that people's savings in their branch are now 'investment products' and can't be withdrawn. 🔊sound pic.twitter.com/cwTPjGz84K — Wall Street Silver (@WallStreetSilv) July 20, 2022 చరిత్ర పునరావృతం అయ్యేనా.. తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం.. టియానన్మెన్ స్క్వేర్ మారణహోమం గుర్తుకు రావడం. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వందల మంది(వేల మంది అని చెప్తుంటారు) మరణించారు. వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో హాంకాంగ్‌లో ఓ యూనివర్సిటీ బయట ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్మారకాన్ని సైతం బలవంతంగా తొలగించింది చైనా. అన్నట్లు మొన్న జూన్ 4వ తేదీకి టియానన్ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. ఆ ఘటనలో.. యుద్ధ ట్యాంకర్ల ఎదురుగా ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చున్న ఫొటో ఒకటి చరిత్రకెక్కింది కూడా. -
3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే
శంకరపట్నం: మూడేళ్లుగా చెరువులో చేపలు మాయమవుతున్నాయి. ప్రభుత్వం వేసిన చేప పిల్లలు కొద్దిగా పెద్దవి అవుతున్నాయో లేదో.. అప్పుడే చెరువులో కనిపించకుండా పోతున్నాయి. దీంతో వాటిని నమ్ముకుని వ్యాపారం చేద్దామనుకున్న మత్య్సకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో చేపల మాయంపై మత్య్సకారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా చేపల దొంగలను పట్టుకోవాలని కష్టపడి గస్తీ కాశారు. ఫలితంగా దొంగలు చిక్కారు. చేపలు దొంగతనం చేస్తున్న ముఠా ఎట్టకేలకు గ్రామస్తులకు చిక్కడంతో వారు పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చెరువులో మూడేళ్లుగా చెరువులో వేసిన చేపలు మాయమవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు చెరువుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రాత్రిపూట నిఘా పెట్టడంతో చేపలు దొంగిలిస్తున్న ఏడుగురి కనిపించారు. వారిని వెంటపడగా నలుగురు మత్స్యకారులకు చిక్కారు. ముగ్గురు పారిపోయారు. ఆ నలుగురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిలో కొత్తగట్టుకు చెందిన నలుగురితో పాటు రేకొండ కమలాపూర్‌కు చెందిన మరో ముగ్గురు చేపల దొంగతనానికి పాల్పడుతున్నారని మత్స్యకారుల సంఘం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు కొత్తగట్టు చెరువు వద్ద దొంగలకు దేహశుద్ధి చేస్తున్న మత్స్యకారులు -
8 ట్యాంకుల ద్వారా రాష్ట్రానికి ఆక్సిజన్ :ఈటల రాజేందర్
-
చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: చెరువులను కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించినా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా, సంస్థలు ఎంత పెద్దవైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పోలీసులు, రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డీజీపీ, ఆయా పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లకు హైకోర్టు స్పష్టం చేసింది. కాలుష్యం నుంచి చెరువులకు విముక్తి కల్పించి, వాటిని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు చర్యలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఎన్నాళ్లీ ఎక్కిళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తప్పేట్టు లేదు. కాలువలకు నీటి విడుదల గడువు పొడిగించినా జిల్లాలోని అన్ని చెరువులు పూర్తిగా నిండలేదు. ఫలితంగా ఈ వేసవిలో నీటి అవసరాలు తీరే అవకాశం కనిపించటం లేదు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతో నీరు భారీగా ఆవిరయ్యే పరిస్థితి ఉంది. దీనికి తోడు వాడకం కూడా పెరుగుతుంది. బుధవారం నుంచి కాలువలు మూసివేస్తున్నారు. 45 రోజులపాటు కాలువలకు నీటి సరఫరా ఉండదు. ఈ దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. డెల్టా ప్రాంతంలో 441 మంచినీటి చెరువులు ఉండగా.. అందులో 426 చెరువుల్ని నింపామని, మిగిలిన చెరువుల్లోనూ నీరు నింపేందుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే చాలా చెరువుల్లో 70 నుంచి 80 శాతం వరకే నీరు నిండింది. మరోవైపు గ్రామాల్లోని జనాభాతో పోలిస్తే చెరువులు తక్కువ సామర్థ్యంతో ఉండటంతో 45 రోజులపాటు నీటిని అందించే పరిస్థితి లేకుండాపోతోంది. కాలుష్యం కాటు చెరువులు పూర్తిగా నిండకపోవడం ఒక సమస్య అయితే.. చాలాచోట్ల నీరు కలుషితమై రంగు మారుతోంది. ఉంగుటూరులో చెరువులో నీరు నిండుగా ఉన్నా రంగు మారిందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. చెరువుల్ని ఆరబెట్టకుండా నీటితో నింపారు. ఫలితంగా జలాలు కలుషితమవుతున్నాయి. నీళ్లు పసర్లెక్కి చెత్తా చెదారంతో నిండుతున్నాయి. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ పూర్తిగా పాడైపోయాయి. అందువల్ల నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. పోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో నీటికొరతను ఎదుర్కొనేందుకు వేసవిలో ఒక్కపూట మాత్రమే కుళాయిల ద్వారా నీరు సరఫరా చేసేవారు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి తలెత్తేలా ఉంది. ఆచంట ప్రాంతంలో వేసవికి ముందే తాగునీటి ఎద్దడి తలెత్తింది. ఆచంట, పెనుమంచిలి, ఎ.వేమవరం, శేషమ్మచెరువు గ్రామాలకే తాగునీరు సరఫరా చేస్తున్నారు. అదికూడా కలుషితం కావడంతో వాడకానికి మాత్రమే వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంబడి ఉన్న పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం గ్రామాల్లో బోర్లు పడని పరిస్థితి. ఫలితంగా ఆ గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో బోర్లు పని చేయడం లేదు. ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి మంచినీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొల్లేరు గ్రామాల్లోని చెరువుల్లో నింపిన నీరు 15 నుంచి 20 రోజులకే రంగు మారుతుండటంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. గుండుగొలను సమగ్ర మంచినీటి పథకం ద్వారా 20 వేల మందికి మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా కొల్లేరు శివారున ఉన్న చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాలకు నేటికి నీరు చేరడం లేదు. కొంతకాలం క్రితం పైపులైన్ ధ్వంసం కావడంతో కోరుకల్లుకు నీరందటం లేదు. భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తుందుర్రు, చినఅమిరం, కొమరాడ, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, లోసరి తదితర 25 గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లో నీళ్లు నింపినా వారం రోజులకే ఇంకిపోతోంది. గ్రామాల్లో జనాభాకు సరిపడా విస్తీర్ణంలో రక్షిత మంచినీటి చెరువులు లేకపోవడంతో ఏటా వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే నీటిఎద్దడి నుంచి గ్రామీణ ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది. -
సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 30నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు. క్రమంగా ఇలా ఆయకట్టు పరిధిలోని మొత్తం చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తుండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. ఉదాహరణలివిగో.. నిడమర్రు మండలంలోని నిడమర్రు, నరసింహపురం రెవెన్యూ గ్రామాల్లోని ఆయకట్టులో మెరక భూములను సైతం ఆక్వా మాఫియా వదిలి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇటీవల 163 ఎకరాల విస్తీర్ణంలో 6 భారీ చెరువులు తవ్వేశారు. నిడమర్రు–ఏలూరు రాష్రీ్టయ రహదారి పక్కనే గల బాడవ ఆయకట్టు పరిధిలోని పంట భూముల్లో చెరువులు తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం చెరువు తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేయలేదు. చెరువులు వద్దకు చేరుకునేందుకు వీలుగా రహదారి సైతం అధికారుల అండతో ఆక్వా మాఫియా సొంతంగా నిర్మించుకుంది. ఈ భూముల్ని లీజుకు తీసుకున్న వారే విద్యుత్ స్తంభాలు కూడా స్వయంగా పాతుకుంటున్నారు. చెరువులకు నీటి సదుపాయం నిమిత్తం మూడు మీటర్ల వెడల్పున కాలువల సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి అయినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. కనీసం దరఖాస్తు చేయలేదు... నిడమర్రు, నరసింహపురం ఆయకట్టులో 163 ఎకరాల్లో కొత్తగా చెరువులు తవ్వారు. ఆ తరువాత 65.89 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 7న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు నంబర్లు పీఆర్ఎఫ్ 011700018229, పీఆర్ఎఫ్ 011700018228, పీఆర్ఎఫ్ 01170018226 ద్వారా ఆన్లైన్లో పరిశీలిస్తుంటే ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు చూపిస్తోంది. పరిశీలన పూర్తికాకుండానే చెరువులు రెడీ అయిపోయాయి. మిగిలిన సుమారు 100 ఎకరాల్లో చెరువులకు సంబంధించి కనీసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చెయ్యలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినా.. అందులోనూ చెరువులు తవ్వేశారు. ముందు తవ్వకాలు.. ఆనక అనుమతులు లీజుదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ముందుగా చెరువులు తవ్వేస్తున్నారు. అ తర్వాత తాపీగా అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల మీసేవా కేంద్రం నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేసు దర్యాప్తు సమయంలో మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో అనధికార అనుమతులతో చెరువులు తవ్వేసినట్టు బహిర్గతమైంది. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో వరి ఆయకట్టు మాయమవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదు. ఇదో సిత్రం చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చే విషయంలో విచిత్రాలు బయటపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే.. ఎలాంటి విచారణ జరపకుండానే అనుమతి వచ్చేసింది. పైగా కలెక్టర్‌కు ప్రతినిధిగా పేర్కొంటూ తహసీల్దార్ డిజిటల్ సంతకం స్థానంలో తహసిల్దార్ సంతకంతో అనుమతి ఇచ్చేశారు. చేపల చెరువుల విషయంలో అధికారులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన పేరిచర్ల బంగారమ్మ, మరికొందరు కలిసి ఐదెకరాల పంట భూమిలో చేపల చెరువు తవ్వేందుకు అనుమతి కోరుతూ ఈనెల 13న నిడమర్రు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోరిన సాగుభూమిని అధికారులు కనీసం పరిశీలించకుండానే ఆన్లైన్లో అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రం వచ్చేసింది. ధ్రువీకరణ పత్రంపై విధిగా జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. ఆయన స్థానంలో నిడమర్రు తహసీల్దార్ పేరు కనిపిస్తోంది. ‘ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ’గా పేర్కొంటూ తహసీల్దార్ ఎం.సుందరరాజు పేరిట ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అంటే తహసీల్దార్ అనుమతి ఉంటే చెరువులు తవ్వేసుకోవచ్చన్నమాట. ఏపీ మీ సేవా పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘చెక్ మీ సేవా సర్టిఫికెట్’ అనే కాలమ్ దరఖాస్తు సంఖ్య పీఆర్ఎఫ్011700018461 నమోదు చెయ్యగానే ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఈ విధంగా ఆన్లైన్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ప్రత్యక్షం అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
‘చెర’బట్టిన రియల్టర్లు
పూసపాటిరేగ: అది ప్రభుత్వ భూమా? చెరువా? శ్మశానమా? పదిమందికీ పనికివచ్చే స్థలమా? దేవాలయామా? అన్న వివేచన లేకుండా ఖాళీగా జాగా కనిపిస్తే చాలు కబ్జాకు తెగబడుతున్నారు కొందరు భూ బకాసురులు. ప్రభుత్వములు, పోరంబోకు భూములు, డి.పట్టా భూములను కబ్జా చేస్తున్న కొందరు రియల్టర్లు ఏకంగా చెరువును కూడా కబ్జాచేసేందుకు ప్రయతించారు. ఈ వ్యవహారం పూసపాటిరేగ మండలంలోని పతివాడ పంచాయతీలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పతివాడ రెవెన్యూ పరిధిలో గల సర్వేనంబరు 37-2లో సుమారు 4 ఎకరాల చెరువు ఉంది. చెరువు పక్కన తమ అధీనంలో భూములను గతంలో గ్రామానికి చెందిన బ్రాహ్మణులు కొందరు రియల్టర్లకు విక్రయించారు. అ తరువాత కూడా రియల్టర్లు రెండుసార్లు క్రయవిక్రయాలు జరిపారు. తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియల్టర్ తాను కొనుగోలు చేసిన భూములతో పాటు చెరువును కూడా కబ్జా చేసేందుకు యత్నించడం విశేషం. ఈ ఆక్రమణ పర్వానికి మండలంలోని కొల్లాయివలసకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరి అండదండలందించడం గమనార్హం. దీంతో ఆ రియల్టర్ జేసీబీ యంత్రాలు పెట్టి చెరువు గట్టును చదును చేశారు. అయితే రెవెన్యూ రికార్డులలో నేటికీ చెరువుగానే ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువు గట్టును తొలగిస్తున్నారు. రికార్డులలో అయితే ఇప్పటికీ చెరువుగానే ఉంది. దీనిపై గ్రామరెవెన్యూ అధికారి కామేశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా రికార్డులలో చెరువుగానే ఉందని, ఎటువంటి అనుమతులు లేకుండా చెరువును ఆక్రమించడం నేరమని స్పష్టం చేశారు. జేసీబీతో జరుగుతున్న పనులను నిలిపివేయించినట్లు తెలియజేశారు. తహసీల్దార్ జనార్దనరావు వద్ద ప్రస్తావించగా చెరువును కప్పే అధికారం ఎవరికీ లేదని, రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
'రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధి'
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం శంకర్పల్లి మండలం జనవాడ, మోక్లతండా, కొండకల్ గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే గండిపేట నుంచి శంకర్పల్లి వరకు... రామంతాపూర్ నుంచి దేవరంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. -
రండి.. స్వచ్ఛంద సాయం అందించండి
► దాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం ► చెరువుల దత్తత.. మిషన్ కాకతీయకు విరాళాలు ► సద్దిమూట.. బడిబాట.. డబుల్ బెడ్రూం ఇళ్లకు సాయం సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యతను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కదులుతోంది. కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఏటేటా సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతాయి. వీటిని ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పనులకు వినియోగిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందనేది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగానే గత ఏడాది ‘మిషన్ కాకతీయ’ చెరువుల పునరుద్ధరణకు విరాళాల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో తెలంగాణ ప్రవాసులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన వచ్చింది. దాదాపు రూ.17 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులను దత్తత ద్వారానే చేపట్టారు. నిరుపేద దళితులకు భూముల పంపిణీ పథకం అమలులోనూ అదే తరహా ఫలితం కనిపించింది. పంపిణీకి అవసరమైన భూముల కొనుగోలుకు సర్కారు సిద్ధపడింది. పలువురు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు స్వచ్ఛందంగా తమ భూములను సర్కారుకు అప్పగించేందుకు ముందుకొచ్చారు. వాటికి చెల్లించే రేటును తమకు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ డాక్టర్ ఉదారతను చాటుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఐదు మార్కెట్ యార్డుల్లో రైతులకు ఐదు రూపాయలకే భోజనం పెట్టే ‘సద్దిమూట’ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. మూడు మార్కెట్లలో ఈ పథకానికి అవసరమైన నిధులను తమవంతుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ సమకూరుస్తోంది. వండి వడ్డించే బాధ్యతలను హరేకృష్ణ సొసైటీ స్వచ్ఛం దంగా నిర్వహిస్తోంది. మరో రెండు మార్కెట్లలో స్థానిక వ్యాపారులే ఈ పథకానికి నిధులు సమకూరుస్తున్నారు. పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి అరబిందో ఫార్మా కంపెనీ ఇటీవలే రూ.1.10 కోట్ల విరాళం అందించింది. విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీలను పంపిణీ చేసి ఉదారతను చాటుకుంది. కార్పొరేట్ కంపెనీలను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేసే బృహత్ ప్రయత్నానికి ఇవన్నీ మచ్చుతునకలుగా నిలిచాయి. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా అమలుకు శ్రీకారం చుట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలోనూ బడా కంపెనీలను భాగస్వాములను చేయాలని సీఎ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారుల సమీక్షల్లో ప్రస్తావించారు. ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు కొన్ని నియోజకవర్గాలు, పట్టణాలను దత్తత ఇవ్వాలని యోచిస్తున్నారు. -
చెరువుల్ని చెరబట్టిన వాటర్ 'మాఫియా'
నగరంలో చెరువులను ఆనుకొని విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు * ఆ నీటితో ట్యాంకర్ల ద్వారా కోట్లలో అక్రమ దందా * మూడు బోర్లు.. ఆరు ట్యాంకర్లుగా సాగుతున్న వ్యాపారం * ట్యాంకర్ నీళ్లను కొనేది రూ.200-రూ.300 * బయట అమ్ముకునేది రూ.1,000-రూ.1,200 * ప్రశ్నిస్తే బెదిరింపులు, దాడులకూ వెనుకాడని మాఫియా * డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతున్న జలాలు *అవే నీటిని జనానికి అంటగడుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: చెరువును ఆనుకొని ఓ ఇల్లు వెలుస్తుంది.. ఇంటి అవసరానికంటూ బోరుబావి తవ్వుతారు.. చెరువుకు దగ్గర్లో ఉండడంతో అందులో పుష్కలంగా నీళ్లు పడతాయి.. ఇంకేముంది వాటర్ మాఫియాకు కాసుల పంట పండినట్టే..! యథేచ్ఛగా నీటిని తోడేస్తూ రోజుకు వందలాది ట్యాంకర్ల ద్వారా కోట్లలో అక్రమ వ్యాపారం!! రాజధాని నగరంలోని చెరువుల చెంత కొన్నేళ్లుగా సాగుతున్న నీటి దందా ఇదీ. కూకట్పల్లి, ఉప్పల్, మియాపూర్, అమీన్పూర్, బాలానగర్, హఫీజ్‌నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. తేలిగ్గా డబ్బు సంపాదనకు అలవాటుపడిన ఈ మాఫియాను ఎవరైనా ప్రశ్నిస్తే.. బెదిరించడంతోపాటు దాడులకూ వెనుకాడడం లేదు. ఇంటి యజమానులకు ఒక్కో ట్యాంకర్‌కు రూ.200-రూ.300 ముట్టజెప్పుతున్న నీళ్ల దళారులు బయట మాత్రం రూ.1,000-రూ.1,200 దాకా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వేసవికి ముందే నీటికి కటకట ఏర్పడడంతో వీరి వ్యాపారం మూడు బోర్లు.. ఆరు ట్యాంకర్లతో కళకళలాడుతోంది. ఓవైపు ఎలాంటి ఆటంకాలు లేకుండా మాఫియా వ్యాపారం సాగిపోతుండగా.. మరోవైపు వారు అమ్ముతున్న నీళ్లను వినియోగిస్తున్న జనం రోగాల బారిన పడుతున్నారు. డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలతో నిండడంతో చెరువుల్లోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. దళారులు ఆ నీటినే తోడి వినియోగదారులకు అమ్ముతున్నారు. వీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, జుట్టు రాలిపోవడం, పిల్లల్లో వాంతులు, విరోచనాలు తదితర సమస్యలు ఏర్పడుతున్నాయి. వ్యాపారం సాగుతోందిలా.. కూకట్పల్లి నుంచి చింతల్‌కి వెళ్లే మార్గంలో ఉన్న ఎల్లమ్మబండ చెరువులోకి నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు, పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ఈ చెరువుకి ఆనుకొని ఇళ్లు నిర్మించుకున్నవారు ఇంటి అవసరాల పేరుతో బోరుబావులు తవ్వుతున్నారు. చెరువుకు కేవలం పదడుగుల దూరంలో ఒక్కొక్కరు రెండు మూడు బోర్లు కూడా వేస్తున్నారు. కొందరు దళారులు ఇళ్ల యజమానుల నుంచి కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని అందులో విచ్చలవిడిగా బోర్లు వేశారు. ఇళ్లపై పెద్దఎత్తున నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకర్లు నిర్మించారు. ఒకేసారి ఐదు ట్యాంకర్లకు నీటిని సరఫరా చేసేలా పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ఇళ్లు ఎల్లమ్మబండ చెరువుని ఆనుకుని పాతికకు పైగా ఉన్నాయి. ఈ చెరువు దిగువన పదెకరాల ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఏకంగా ఎనిమిది బోర్లు వేశారు. వాటి నుంచి వచ్చిన నీళ్లని ఒక ట్యాంకులో నింపుతున్నారు. ఆ ట్యాంకు నుంచి ట్యాంకర్లకు నీళ్లు వెళ్తాయి. ఏ సమయంలో చూసినా అక్కడ పది నుంచి పదిహేను ట్యాంకర్లు నీటి కోసం క్యూ కట్టి ఉంటాయి. ఆ స్థలం యజమానిని వ్యాపారం గురించి అడిగితే ‘‘నేను నీటిని అమ్మడం లేదు. కూకట్‌పల్లిలోని పదకొండు అపార్ట్మెంట్లకు ఉచితంగా ఇస్తున్నాను’’ అని చెప్పడం గమనార్హం. హఫీజ్‌పేట్ ప్రాంతంలోని ప్రకాష్‌నగర్ చెరువు వద్ద కూడా ఇదే పరిస్థితి. ఈ చెరువును ఆనుకుని చిన్న షెడ్ నిర్మాణం చేసి అందులో రెండు బోర్లు వేసి నడిరోడ్డుపై నీటి వ్యాపారం చేస్తున్నారు. దర్గా సాక్షిగా దందా... హఫీజ్‌పేట్ సమీపంలో గోకుల్‌ఫ్లాట్స్ దగ్గర రోడ్డుకి ఆనుకుని ఉన్న దర్గాలో పెద్ద బావి తవ్వి అందులో బోర్లు వేశారు. అక్కడ పెద్ద ఎత్తున నీటి అక్రమ వ్యాపారం సాగుతోంది. 25 వేల లీటర్ల నీటి ట్యాంక ర్ను రూ.5 వేల చొప్పున అమ్ముతున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఇక్కడ నీటి అమ్మకం గురించి ఆరా తీసి వెళ్తుండగా.. ఓ వ్యక్తి కారులో వెంబడించి దారిలో అడ్డగించాడు. ‘వాటర్ ట్యాంకర్‌కి ప్రెస్ వాళ్లకి ఏ సంబంధం? నీళ్లు కావాలన్నావుగా వచ్చి కొనుక్కో లేకుంటే ఇంటికి పోవు....’ అంటూ బెదిరింపులకు దిగాడు. కాసేపటికి కొందరు అక్కడికి చేరుకోవడంతో కారుతో ఉడాయించాడు. ఆ కారుకు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. దర్గాకు వచ్చేవారి కోసం వేసిన బోరు నీటితో వ్యాపారం చేస్తుండడం, ప్రశ్నించినందుకు బెదిరించడాన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లగా.. ‘ఎక్కడ వ్యాపారం ఆగిపోతుందోనని భయపెడదామనుకున్నట్టున్నారు.. వచ్చేది నీళ్ల సీజన్ కదా’’ అని అన్నారు. కోట్లలో వ్యాపారం... హైదరాబాద్‌లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకర్ల సంఖ్య వెయ్యి. రోజుకి ఒక ట్యాంకరు ఐదు ట్రిప్పులు తిరుగుతుంది. రూ.450కు 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్ ఇస్తోంది. ఫోన్ చేసిన రెండ్రోజులకు ఈ ట్యాంకర్ వస్తుంది. ఇది ప్రభుత్వం చేసే కమర్షియల్ నీటి సరఫరా. ఇక ప్రైవేటు విషయానికొస్తే నగరంలో దాదాపు 5 వేల ట్యాంకర్లుంటాయి. ఒక్కో ట్యాంకరు రోజుకు ఆరు ట్రిప్పుల వరకూ వేస్తుంది. ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకరుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.3.6 కోట్లు, నెలకు వంద కోట్ల పైనే ప్రైవేటు నీటి వ్యాపారం జరుగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో ట్యాంకర్‌కు రూ.1,500 దాకా గుంజుతున్నారు. చెరువుల నుంచి విచ్చలవిడిగా నీటిని తోడేయడంతో భూగర్భ జలాల నీటి మట్టం కూడా గణనీయంగా పడిపోతోంది. కళ్లుగప్పి వ్యాపారం చేస్తున్నారు కూకట్పల్లి పరిధిలో చెరువు చుట్టు కానీ, పొలాల్లో కానీ, ఇళ్ల దగ్గర కానీ ఎక్కడా కమర్షియల్ బోర్లకు మేం అనుమతి ఇవ్వలేదు. కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చాం. అధికారుల కళ్లు గప్పి నీటి వ్యాపారం చేసుకుంటున్నారని తెలిసింది. - నర్సింహారెడ్డి, ఎమ్మార్వో, కూకట్పల్లి నీటి వ్యాపారం వాస్తవమే.. అధికారుల కళ్లు కప్పి నీళ్ల వ్యాపారం చేసుకుంటున్నవారు చాలామంది ఉన్నమాట వాస్తవమే. కానీ మేం ఎవరికీ కమర్షియల్ బోర్లకు అనుమతి ఇవ్వలేదు. ఇంటి కోసం అని చెప్పి చెరువు పక్కన బోర్లు వేస్తున్నారు. ఆ నీటిని చాటుగా ఇలా అమ్ముకుంటున్నారు. ఇలాంటివి మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మార్వో, హఫీజ్‌పేట్ -
చెరువులకు మహర్దశ
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో చెరువులకు పూర్వవైభవం రానుంది. వాటి మరమ్మతులకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకనుగుణంగా మిషన్ కాకతీయ ద్వారా మొదటి విడతలో 1266 చెరువులు ఎంపికయ్యాయి. దీంతో పూడికతో నిండిపోయిన చెరువులు, కుంటల్లో యుద్ధప్రాతిపదికన ఒండ్రుమట్టిని తీయడంతో పాటు వాటికి వచ్చే వరద కాలువలను బాగుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో చెరువు స్థాయినిబట్టి రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఖరీప్ నాటికి వీటిని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అందుకోసం జనవరి 27నుంచి టెండర్లు నిర్వహించేం దుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఎంపికైన చెరువుల చిట్టాను జిల్లా చిన్ననీటిపారుదల అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు... జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వంద ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819 ఉన్నాయి. వీటికింద 82,722 ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ చెరువులను 30 ఏళ్లుగా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఒండ్రుమట్టితో పూడిపోయాయి. వీటికి వరద వచ్చే కాల్వలు కూడా మట్టితో నిండి చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ చెరువులలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండటం లేదు. దీంతో వాటికింద సాగవ్వాల్సిన ఆయకట్టు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం చెరువులన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా మొదటి విడతలో భాగంగా 20శాతం చెరువులను బాగుపరచాలనుకొంది. అందుకోసం ఆయా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని చెరువులను మొదటి ప్రాధాన్యతగా వేటిని చేపట్టాలో సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలందరూ వారి ప్రాధాన్యతను అధికారులకు అందజేశారు. ఇలా మొత్తం మీద ఎమ్మెల్యేల నుంచి 1569 చెరువులకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 20శాతం మించకుండా ఉండేం దుకు అధికారులు స్క్రూటినీ చేశారు. ఇలా మొత్తం మీద 1266 చెరువులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. చెరువులన్నీ ఖాళీయే.. ఈ ఏడాది కురిసిన వర్షాలు అంతంత మాత్రంగా ఉండడం, పడినచోట్ల వరద కాలువలు సరిగా లేని కారణంగా జిల్లాలోని చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గా వర్షాలు కురవడంతో పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. ఈ డివిజన్ పరిధిలో 318 పెద్దవి, 2646 చిన్న చెరువులున్నాయి. వీటిలో చిన్నా, పెద్దా కలిపి మొత్తం 334 నిండాయి. చెరువుల నిర్వాహణ సరిగా లేకపోవడంతో 46 చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్ పరిధిలో 152 పెద్దవి, 1,069 చిన్న చెరువులున్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 223 పెద్దవి, 2,104 చిన్న చెరువులున్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువు పూర్తిస్థాయిలో నిండకపోగా... ఐదు చెరువులకు గండ్లుపడి ఉన్న నీరంతా వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితి వచ్చే ఏడాది నుంచి చెక్‌పడనుంది. గతంలో మాదిరిగా చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండనుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల వివరాలు డివిజన్ చెరువులు మిషన్ కాకతీయకు ఎమ్మెల్యేలు ఎంపిక ప్రతిపాదించినవి మహబూబ్‌నగర్ 1,872 375 413 వనపర్తి 1,480 295 280 నాగర్‌కర్నూల్ 1,670 336 576 నారాయణపేట 1,301 260 300 -
చెరువులకు నేటి నుంచి టెండర్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు టెండర్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 చెరువులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసిన మరో 1,200 నుంచి 1500 చెరువులకు టెండర్లు పిలవొచ్చని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. అంచనాలను స్క్రూటినీ చేసిన చెరువులకు జిల్లాల వారీగా ఎస్‌ఈలే టెండర్లను ఖరారు చేస్తారన్నారు. సోమవారం నాటి టెండర్లన్నీ రూ.కోటికి మించనివేనన్నారు. -
చెరువుల జీవో రద్దు!
* 111 జీవోను ఉపసంహరించి 80 గ్రామాలకు ఊరటనిస్తాం: సీఎం * హిమాయత్‌సాగర్ ఎగువ గ్రామాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం * కోర్టు వివాదాల్లోని లక్షల కోట్ల విలువైన భూములను విడిపిస్తాం.. ఆ డబ్బుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం * సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు యావత్ తెలంగాణ జాతి కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లక్షల కోట్ల విలువైన భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, వాటిని విడిపించి ఆ డబ్బును రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 80కి పైగా గ్రామాలకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 111 ఉపసంహరణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హిమాయత్‌సాగర్ కలుషితం కాకుండా.. దాని ఎగువభాగంలో భారీ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిషేధిస్తూ ఈ జీవోను తెచ్చారని, కానీ జీవో వల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని సీఎం వివరించారు. అన్ని గ్రామాలకూ ఈ జీవోను వర్తింపజే యాల్సిన అవసరం లేదని, కొన్నింటిని మినహాయించేందుకు ముందుగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. అధికారులు, శాసనసభ్యులతోనూ కమిటీ వేసి దాని నివేదిక ఆధారంగా స్పందిస్తామన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత నిమిషం కూడా కరెంటు కోత లేకుండా చేస్తానని ఇప్పటికే చెప్పానని, దాన్ని చేసి తీరుతానని నొక్కిచెప్పారు. అలాగే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండేలా చూస్తానని, అందరితోనూ కృష్ణా, గోదావరి నీరు తాగిస్తానని చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులు లక్షాధికారులవుతారని అన్నారు. జిల్లాలోని వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బిందు సేద్యం పరికరాలను దళితులకు వంద శాతం రాయితీపై, బీసీలకు 90 శాతం రాయితీపై అందజేస్తామన్నారు. రంగారెడ్డి నుంచి వచ్చే కూరగాయలు రాజధానికి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ క్రమక్రమంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. చేవెళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల, శంకరపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయిస్తానన్నారు. రోడ్లను అభివృద్ధి చేయిస్తానని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే యాదయ్యతో పాటు పోలీస్ రామిరెడ్డి, వారి అనుచరులు కూడా అధికార పార్టీలో చేరారు. -
చెరువుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు
చెరువుల మరమ్మతులకు ఈ ఏడాదికి 2వేల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. చెరువులు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి మూలాలు. తెలంగాణ నీటిపారుదల అవసరాలను తీరుస్తున్నవి ఇవే. అయితే మైనర్ ఇరిగేషన్ పేరిట ఉమ్మడి రాష్ట్రంలో వీటిని ధ్వంసం చేశారు. దాంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. 1960 ప్రాంతంలో కూడా చెరువుల ద్వారానే 60 శాతం వరకు వ్యవసాయం సాగేది. కానీ తర్వాత చెరువుల్లో పూడిక కూడా తీయలేదు. దాంతో కేవలం 8 శాతం భూములు మాత్రమే చెరువుల కింద ఉన్నాయి. ఇప్పుడు 80 శాతం వ్యవసాయం కేవలం కరెంటు మోటార్ల కిందే జరుగుతోంది. దీన్ని తగ్గించడానికి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరిస్తాం. 45 వేలకు పైగా చెరువులను వచ్చే ఐదేళ్లలో పునరుద్ధరిస్తాం. ప్రతి ఏటా 9వేల చెరువులు బాగుచేస్తాం. ఈ ఏడాది 9 వేల చెరువులకు 2 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యప్రకారం పూర్తిచేయాలి. మొత్తం నీటిపారుదల రంగానికి 6,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. -
చెరువులకు జీవకళ
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వందెకరాల విస్తీర్ణంలో ఉన్నవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819. వీటికింద 82,722 ఎకరాల పంట సాగవుతోంది. అయితే ఈ చెరువుల్లో 30 ఏళ్లుగా ఒండ్రుమట్టి పేరుకుపోయింది. వీటికి వరద వచ్చే కాల్వలు కూడా మట్టితో నిండుకున్నాయి. దీంతో చెరువులు కింద ఆయకట్టు అంతంత మాత్రంగానే సాగువుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెరువులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా మొదటి విడతలో 20శాతం చెరువులు బాగుచేయాలని భావించింది. అందుకోసం ఆయా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని చెరువులను మొదటి ప్రాధాన్యతగా వేటిని చేపట్టాలో సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు కూడా వారి ప్రాధాన్యం గల చెరువుల చిట్టాను అధికారులకు అందజేశారు. డివిజన్ల వారీగా.. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోకి మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ని యోజకవర్గాలు, దేవరకద్ర నియోజకవర్గం లోని సగభాగం, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు, తిమ్మాజిపేట మండలాలు వస్తాయి. వీటికి సంబంధిం చి ఎమ్మెల్యేల నుంచి చిన్నాపెద్దా అనే తేడాలేకుండా 713 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ కిందికి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చం పేట నియోజకవర్గాలు వస్తాయి. ఈ డివిజన్లో ఎమ్మెల్యేల నుంచి మొత్తం 576 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే వనపర్తి డివిజన్ పరిధిలో కి వనపర్తి, అలంపూర్, గద్వాల, దేవరకద్ర నియోజకవర్గంలోని సగభాగం వస్తోంది. దీని పరిధిలో ఎమ్మెల్యేల నుంచి 280 చెరువుల పు నరుద్ధరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ఇలా జిల్లావ్యాపంగా మొత్తం 1569 చిన్నాపెద్ద చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు అందాయి. నిండని చెరువులు ఈ ఏడాది వర్షాలు అంతంత మా త్రంగానే కురవడంతో జిల్లాలోని చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గానే వర్షాలు కురిశాయి. ఈ డివిజన్లో 318 పెద్దవి, 2,646 చిన్న చెరువులున్నాయి. వీటిలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 334 నిండాయి. 46 చెరువుల నిర్వహణ సరిగా లేకపోవడంతో గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్లో 152 పెద్దవి, 1,069 చిన్నవి ఉన్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్లో 223 పెద్దవి, 2,104 చిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువూ పూర్తిస్థాయిలో నిండకపోగా.. ఐదు చెరువులకు గండ్లు పడి ఉన్న నీరంతా వెళ్లిపోయింది. చెరువులను అభివృద్ధి చేయడం పట్ల రైతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చెరువులన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయి: కేసీఆర్
హైదరాబాద్: సీమాంధ్ర పాలనలో చెరువులన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పూర్తి స్థాయిలో నీటి వినియోగానికి చెరువుల పునరుద్ధరణే ఏకైక మార్గం అని కీసీఆర్ అభిప్రాయపడ్డారు. చెరువులు లేకపోవడం వల్లనే రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలను పూర్తిగా వాడుకోలేకపోతున్నామన్నారు. డిసెంబర్ లో చేపట్టబోయే మొదటి దశ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి 450 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామల్లో మొదటగా చెరువులు పునరుద్ధరణ చేపడుతామన్నారు. స్కూల్, కాలేజిలో చెరువుల పునరుద్ధరణపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని కేసీఆర్ అన్నారు. -
చెరువుల అనుమతికి ప్రత్యేక సెల్
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాయలంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చేపల చెరువులకు అనుమతులు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే చేపల చెరువులకు అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చేపల చెరువుల అనుమతుల్లో పారదర్శకతను పెంచి అవినీతిని తగ్గించాలన్నారు. వ్యవసాయ భూములను చెరువులుగా మార్చరాదని, కొల్లేరును పరిరక్షించాలని, అదే సమయంలో చిన్న రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని పేర్కొన్నారు. చెరువులు తవ్వేటప్పుడు సన్న, చిన్నకారు రైతుల అభిప్రాయాలను, సాగునీటి కాలువలు, మంచినీటి వనరులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మండల స్థాయి కమిటీల నుంచి చేపల చెరువుల అనుమతుల ప్రతిపాదనలను డివిజన్‌స్థాయి కమిటీ పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాస్థాయి కమిటీ ద్వారా అనుమతులు పొందాలన్నారు. ఇరిగేషన్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అనుమతులు పొందినదీ లేనిదీ సమీక్షించి ఈ నెల 29న నిర్వహించే జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మత్స్య శాఖ డెప్యూటీ డెరైక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఏడీ షేక్ లాల్ మహ్మద్, వ్యవసాయశాఖ జేడీ కృపాదాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి ఏడీ జి.పెంటోజీరావు పాల్గొన్నారు.