Russia Ukraine War Day 2 Live Updates: రష్యా ఆధీనంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ - Sakshi
Sakshi News home page

Russia Ukraine War Day 2: రష్యాపై అమెరికా సైబర్‌ అటాక్‌

Published Fri, Feb 25 2022 10:32 AM | Last Updated on Fri, Feb 25 2022 7:43 PM

Russia Ukraine Crisis: Vladimir Putin Declared War Ukraine Live Updates In Telugu - Sakshi

LIVE UPDATES DAY 2:

పుతిన్‌ ఆస్తులు ఫ్రీజ్‌.. ఈయూ వార్నింగ్‌
► ఉక్రెయిన్​పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్‌ ఆస్తులను ఫ్రీజ్‌ చేస్తామని ఈయూ వెల్లడించింది. 
చర్యలకు రెడీ.. పుతిన్‌ కార్యాలయం వెల్లడి 
 ఉక్రెయిన్‌ అధికారులతో చర్యలకు పుతిన్‌ సిద్దంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. చర్చల కోసం బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా ఓ బృందాన్ని పంపనున్నట్టు పేర్కొంది. 

రష్యాపై అమెరికా సైబర్‌ అటాక్‌
► ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించింది. తాజాగా అమెరికా.. రష్యా ఢిపెన్స్‌ సైట్‌ను డౌన్‌ చేస్తూ సైబర్‌ అటాక్‌ చేసింది.  

పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఫోన్‌..
► ఉక్రెయిన్‌పై రష్యా వార్‌ కొనసాగిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు రంగంలోకి దిగారు. శుక్రవారం జిన్‌పింగ్‌.. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ రెండు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. 

భారతీయులను తరలించేందుకు 2 ప్రత్యేక విమానాలు..

► ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స‍్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప‍్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలను నడుపనున్నట్టు వెల్లడించింది. కాగా, వారి కోసం విమాన ఛార్జీలను సైతం కేంద్రమే భరించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం రాత్రి రెండు ప్రత్యేక విమానాలు ఉక్రెయిన్‌ సమీప దేశాల నుంచి బయలుదేరనున్నాయి. రుమేనియా దేశం మీదుగా ఈ విమానాలు తిరిగి స్వదేశానికి రానున్నాయి. ఇదిలా ఉండగా భార‌తీయ అధికారుల బృందాలు విద్యార్థులను హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు పంపిస్తారు. అక్క‌డ్నుంచి విద్యార్థుల‌ను స్వ‌దేశానికి తీసుకురానున్నారు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు అక్కడి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. విద్యార్థులకు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు.

రష్యాతో చర్చలకు సిద్దం.. ఉక్రెయిన్‌ 
► రష్యా ప్రకటనతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.  రష్యాతో చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రకటించారు. అంతకు ముందకు రష్యా సైతం తాము చర్చలకు సిద్ధమంటూ ప్రకటన చేసింది. 
 

► రష్యా కీలక నిర్ణయం.. చర్చలకు సిద్ధం.. 

ఉక్రెయిన్‌ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ సైన్యం గనుక పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ను నియో-నాజీల తరహాలో పాలించడం మాస్కోకు సైతం ఇష్టం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

►బ్రిటన్‌ విమానాలపై రష్యా నిషేధం
►యూకేకు కౌంటర్‌గా విమానాలపై రష్యా నిషేధం
►రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా ఆంక్షలు విధించిన యూకే
►యూకే విమానాలు తమ గగన తలంలోకి రాకుండా రష్యా నిషేధం


► రాజధానీ కీవ్‌ నగరాన్ని రష్యన్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారికంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రకటించాడు.
►రష్యా ఆధీనంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్
►సమీ సిటీలో రష్యా బలగాల విధ్వంసం
►రష్యాకు చెందిన 10 యుద్ధ విమానాలను కూల్చేశామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రకటించారు.
►సభ్యత్వం ఇవ్వడానికి ఎవరు ముందుకొచ్చారని నాటోని ఉద్దేశించి ప్రశ్నించిన జెలెన్‌స్కీ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాటో దేశాలు కూడ సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
►తమకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని, రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా పై పోరాటంలో ఒంటరయ్యామని ఆయన ఆవేదన చెందారు.
►ఇప్పటివకు మధ్య, తూర్పు, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోనే యుద్ధం జరిగింది. పశ్చిమ ప్రాంతాలకు కూడా యుద్ధం విస్తరించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
►కీవ్‌ నగరం స్వాధీనమే లక్ష్యంగా బాంబు పేలుళ్లతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో కీవ్‌ దగ్గరలోని ఎయిర్‌స్ట్రీప్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది.
►రాత్రి 7.30 గంటలకు నాటో దేశాల కీలక సమావేశం

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. బెలారస్‌ వైపు నుంచి ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశిస్తున్నాయి. తొలి రోజు ఖార్కివ్‌, ఒడెస్సా, లుహాన్స్‌, సుమీ నగరాలతో పాటు మొత్తం 13 నగరాలపై రష్యా బలగాలు దాడులు చేశాయి. ఉక్రెయిన్‌ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు  రష్యా ప్రకటించింది.   (చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: ప్రపంచదేశాలు ఏమంటున్నాయంటే..? )

ఇప్పటికే చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ రష్యా తన అధీనంలోకి తెచ్చుకుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు, ఏ క్షణాన్నైనా కీవ్‌ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 137 మంది మృతిచెందినట్లు సమాచారం. సైనికులతో పాటు సామన్య ప్రజలు కూడా మరణించారని, వందలాది మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement