జగిత్యాలకు ఒకే ఒక్క దరఖాస్తు | - | Sakshi
Sakshi News home page

జగిత్యాలకు ఒకే ఒక్క దరఖాస్తు

Published Wed, Aug 30 2023 12:40 AM | Last Updated on Wed, Aug 30 2023 8:58 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:  ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ఆశావహుల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలకు అధికార బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా పోటీకి నేతల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి లీడర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో అత్యధికంగా కరీంనగర్‌కు 15 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా జగిత్యాలకు ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. గతంలోలా కాకుండా ఈసారి ఇప్పటికే తమ పార్టీ స్థితిగతులపై పలుదఫాలుగా సర్వేలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇపుడు ఆ సర్వే ఫలితాల ఆధారంగా టికెట్‌ కేటాయించనుందని సమాచారం. సామాజిక వర్గాలవారీగా ఓసీ, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ధరావత్తు సొమ్ము చెల్లించి మరీ తమ ఆకాంక్షను పార్టీకి తెలియజేశారు. ఈనెల 25తో దరఖాస్తులకు గడువు ముగియడంతో వాటి పరిశీలన మొదలైంది.

ఈ వడపోత కార్యక్రమం ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ప్రకటిస్తారా? లేక కొత్తగా పార్టీలో చేరేవారికి దరఖాస్తుకు మరోసారి గడువు పెంచుతారా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే గాంధీభవన్‌ నుంచి ఢిల్లీ వరకు ఎవరి పైరవీలు వారు ప్రారంభించారు. తమకే టికెట్‌ కేటాయించాలని, ఒక్కచాన్స్‌, చివరి చాన్స్‌ అంటూ యత్నాలు చేస్తున్నారు.

13 నియోజకవర్గాల్లో దరఖాస్తులు ఇలా..

కరీంనగర్‌–15:
రేగులపాటి రమ్యారావు, మేనేని రోహిత్‌రావు, డాక్టర్‌ కొనగాల మహేశ్‌, వైద్యుల అంజన్‌కుమార్‌, మొహమ్మద్‌ అబ్దుల్‌ షమీద్‌ (నవాబ్‌), కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పురమల్ల శ్రీనివాస్‌, జువ్వాడి నిఖిల్‌ చక్రవర్తి, రేగులపాటి రితీశ్‌రావు, సత్తు మల్లయ్య, కర్ర సత్యప్రసన్న, పడాల రాహుల్‌, ఎండీ రహమత్‌ హుస్సేన్‌, కొత్త జైపాల్‌రెడ్డి.

చొప్పదండి–7: మేడిపల్లి సత్యం, జిల్లాల భానుప్రియ, వెన్న రాజమల్లయ్య, కాశిపాక రాజేశ్‌, చిగురు శకుంతల, నాగి శేఖర్‌, మైక లక్ష్మణ్‌.

మానకొండూర్‌–2: డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, తిప్పార సంపత్‌.

హుజూరాబాద్‌–13: పాతి రామకృష్ణారెడ్డి, జాలి కమలాకర్‌రెడ్డి, వొంటెల లింగారెడ్డి, ప్యాట రమేశ్‌, కె.బుచ్చిరెడ్డి, గూడెపు సారంగాపాణి, బల్మూరి వెంకట నర్సింగ్‌రావు, టి.రవీందర్‌, కశ్యప్‌ రెడ్డి ముద్దసాని, సాయిని, రవికుమార్‌, పూదరి రేణుక, దాసరి భూమయ్య, తిప్పార సంపత్‌.

హుస్నాబాద్‌–06: పొన్నం ప్రభాకర్‌, అల్గీరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వొంటెల లింగారెడ్డి, బాలిశెట్టి శివయ్య, వొంటెల రత్నాకర్‌, డాక్టర్‌ గజ్జెల మల్లేశ్‌.

పెద్దపల్లి–05: కిరణ్‌కుమార్‌ వెల్పుల, చింతకుంట విజయరమణారావు, గంట రాములు, చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్య.

రామగుండం–06: ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, హర్కర వేణుగోపాల్‌రావు, బాజ్‌పాల్‌ జనక్‌ప్రసాద్‌, అంచర్ల మహేశ్‌ యాదవ్‌, రియాజొద్దీన్‌ అహ్మద్‌, గంట సత్యనారాయణరెడ్డి.

మంథని–02: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శివనాద్రి ప్రమోద్‌కుమార్‌.

వేములవాడ–04: ఆది శ్రీనివాస్‌, ఎం.చంద్రశేఖర్‌ యాదవ్‌, టి.అంజయ్యయాదవ్‌, సింగిరెడ్డి నరేశ్‌రెడి.్డ

సిరిసిల్ల–04: సంగీతం శ్రీనివాస్‌, చీటి ఉమేశ్‌రావు, నాగుల సత్యనారాయణ, కేకే మహేందర్‌రెడ్డి.

జగిత్యాల–01: తాటిపర్తి జీవన్‌రెడ్డి.

కోరుట్ల–13: కల్వకుంట్ల సుజిత్‌రావు, కోమొరెడ్డి జ్యోతిదేవి, జువ్వాడి నర్సింగరావు, రుద్ర శ్రీనివాస్‌, రుద్ర శంకర్‌, మొహమ్మద్‌ షకీర్‌ సిద్దిఖీ, కోమొరెడ్డి కరమ్‌ చంద్‌, కోట దుర్గారాజ్‌, కాటిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, ఆసిఫ్‌ హబీబ్‌, అలే పాండురంగా, మొహమ్మద్‌ హబీబ్‌ ఖాన్‌.

ధర్మపురి–07: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గజ్జెల స్వామి, వడ్లూరి కృష్ణ, గుమ్మడి కుమారస్వామి, బండారి కనుకయ్య, రవీందర్‌ మద్దెల, బొల్లి స్వామి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement