‘సీసీ’ నిఘాలో ఇంటర్ పరీక్షలు
● ఈ నెల 5 నుంచి 22 వరకు నిర్వహణ ● జిల్లాలో 28 కేంద్రాలు ఏర్పాటు చేశాం ● విద్యార్థులు ఆందోళన చెందకుండా సకాలంలో హాజరై, రాయాలి ● డీఐఈవో నారాయణ
జగిత్యాల: ఈ నెల 5 నుంచి
ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని డీఐఈవో నారాయణ అన్నారు.
విద్యార్థులు ఆందోళన చెందకుండా సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: ఎంతమంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారు?
డీఐఈవో: మొత్తం 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల విధుల్లో ఉంటారు. అలాగే, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించాం.
సాక్షి: సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా?
డీఐఈవో: పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇవి హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసులో గల కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానంగా ఉంటాయి.
సాక్షి: విద్యార్థులు సెంటర్‌కు ఏ సమయానికి చేరుకోవాలి?
డీఐఈవో: ఉదయం 8.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. సమయం దాటితే లోపలికి అనుమతించరు. అందుకే విద్యార్థులు సకాలంలో చేరుకోవాలి.
సాక్షి: ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు?
డీఐఈవో: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 6,104 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 969 మొత్తం 7,073, ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 6,395 మంది విద్యారుథలు, ఒకేషనల్‌లో 982 మొత్తం 7,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
సాక్షి: నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉంటుందా?
డీఐఈవో: నిమిషం ఆలస్యం నిబంధనపై ఇప్పటికై తే ఎలాంటి ఆదేశాలు రాలేదు. కానీ, తప్పకుండా ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
సాక్షి: ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఐఈవో: ఈ నెల 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. బెంచీలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం.
సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు?
డీఐఈవో: విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు. భయపడొద్దు. పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం ఇవ్వగానే ముందు క్షుణ్ణంగా చదవాలి. సమాధానం రాసేటప్పుడు ప్రశ్న నంబర్ తప్పనిసరిగా వేయాలి. హ్యాండ్‌రైటింగ్ గజిబిజి లేకుండా నీట్‌గా ఉంటే అధిక మార్కులు సాధించవచ్చు.
‘సీసీ’ నిఘాలో ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment