గాంధీకి ఘననివాళి
జనగామరూరల్: జిల్లా కాంగ్రెస్ కార్యాలయం, పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జాతిపిత గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గాంధీజీ చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదె మోహన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, రాజమౌళి, కల్యాణి, మల్లారెడ్డి, శ్రీనివాస్, మహేందర్, రామచంద్రం, ధనలక్ష్మి, యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు
అంతిమ పోరాటం
బచ్చన్నపేట: ఎస్సీ వర్గీకరణకు అంతిమ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని, దానికి అందరూ నడుం బిగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు. జిల్లా అధ్యక్షుడు పైస రాజశేఖర్ అధ్యక్షతన మండల కేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణకు పాటుపడుతామని తెలిపి నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ‘వేయి గొంతులు– లక్ష డప్పుల దండోరా’ సాంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతం కోసం ఫిబ్రవరి 1న మంద కృష్ణమాదిగ జనగామకు వస్తున్నారని ఈ సన్నాహక సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అల్వాల నర్సింగారావు, బొట్ల మహేష్, పాకాల కుమారస్వామి, అల్వాల రాజు, విజయ్, ప్రదీప్‌కుమార్, ప్రశాంత్, తరుణ్, నిఖిల్, నాగరాజు, లక్ష్మణ్, పర్శరాములు, సాయిలు, మల్లేష్, అజయ్ పలువురు పాల్గొన్నారు.
పర్యావరణ విద్య పరీక్షకు 211 మంది గైర్హాజరు
జనగామ రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో గురువారం పర్యావరణ పరీక్ష నిర్వహించినట్లు డీఐఈఓ జితేందర్ తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 4,275 విద్యార్థులకు 4,064 మంది హాజరు కాగా 211 విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల్లో తనిఖీ చేపట్టిన్లట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
జిల్లాస్థాయి సాఫ్ట్
క్రీడా జట్ల ఎంపిక
జనగామ రూరల్: జనగామ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ సీ్త్ర, పురుష విభాగం జిల్లా జట్ల ఎంపికలు ప్రెస్టన్ ఇనిస్టిట్యూట్ హై స్కూల్ గ్రౌండ్లో నేడు(శుక్రవారం) ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భగత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డుతో రావాల్సిందిగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment