236 మందికి టూడీ ఎకో పరీక్షలు
● గుండె పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలోని డిస్ట్రిక్ల్ ఎర్లీ ఇంటర్వేన్షన్ కేంద్రం(డైక్)లో గురువారం చిన్నల పిల్లల కోసం నిర్వహించిన గుండె పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. శిబిరంలో 236 మంది పిల్లలకు గుండె సంబంధ టూడీ ఎకో పరీక్షలు నిర్వహించగా 75 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. 15 మందిని నిర్ధారణ కోసం ఇతర పరీక్షల నిమిత్తం రెఫర్ చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని ఆరోగ్య శ్రీ పథకంలో ఉచితంగా అపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లల్లో వచ్చే గుండె సంబంధ వ్యాధులను డీఈఐసీ ద్వారా ముందే గుర్తించి శస్త్ర చికిత్స చేస్తే భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని చెప్పారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యాన ఎంజీఎం ఆస్పత్రిలో డీఈఐసీ, ఆర్బీఎస్కే మొబైల్ టీమ్స్ సహకారంతో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, ఆర్ఎంఓ అంబి శ్రీనివాస్, డీఐఓ ప్రకాశ్, డీఈఐసీ పిడియాట్రీషన్ మంజుల, వైద్యులు శ్రీలక్ష్మి, మేనేజర్ అనిల్, అపోలో ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
విద్యాసామర్థ్యాలు పెంపొందించుకోవాలి
జనగామ రూరల్: విద్యార్థులు ఆలోచనతోపాటు విద్యాసామర్థ్యాలను పెంపొందించుకోవాలని కమలా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హుజూరాబాద్ ఎలక్ట్రకల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ యోగేశ్ పుండరిక్ పేర్కొన్నారు. యశ్వంతపూర్‌లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్ట్సిట్యూట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో డిజైన్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్ డిజైన్ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు ప్రతి ఆలోచనకు కావాల్సిన విషయపరిజ్ఞానం అమలు చేసేందుకు కావాల్సిన పరిష్కార మార్గాలను ఎంచుకోవాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్య తకు తామే మెరుగులు దిద్దుకోవాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ విజయపాల్‌రెడ్డి, సెల్ కోఆర్డినేటర్ యాకుబ్, అనిత, రఘుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment