చిల్పూరు హుండీ ఆదాయం రూ.7.54 లక్షలు
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుగు నెలలకు సంబంధించిన హుండీలోని కానులను గురువారం లెక్కించగా రూ.7,54,080 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు వెల్లడించారు. ఉదయం ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచర్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు భువనగిరి డివిజన్ అధికారి వెంకటలక్ష్మి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం హుండీల్లోని కానుకల లెక్కింపు ప్రారంభించారు. హుండీల్లో నగదుతోపాటు 162 గ్రాముల మిశ్రమ వెండి, అమెరికన్ డాలర్లు, యూరోస్ వచ్చినట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, ధర్మకర్తలు గనగోని రమేష్, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, కొలిపాక రాజులతోపాటు ఇండియన్ బ్యాంకు మల్కాపూర్ శాఖ అధికారులు, లక్ష్మీసేవాసమితి, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment