‘డీఈఓపై చర్యలు తీసుకోవాలి’
జనగామ రూరల్: జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు గురువారం ఆ సంఘం జిల్లా కార్యదర్శి ధర్మబిక్షం ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం దేవరుప్పుల మండలంలోని బాలయేసు స్కూల్‌పై ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ జరపకుండా ఆ స్కూల్ యాజమాన్యానికి డీఈఓ తొత్తుగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పాఠశాల నిబంధనలు, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తున్నదన్నారు. అనుభవం లేని డ్రైవర్లతో స్కూల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. డీటీఓ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తన ఇష్టానుసారంగా విచారణ జరిపి అవగాహన కల్పించనం అని చేతులు దులుపుకున్నట్లు తెలిపారు. ఫీజుల విషయంలో పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందుకు బాధ్యులైన స్కూల్ యాజమాన్యంతోపాటు డీఈఓ, డీటీఓపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment