జనగామ రూరల్: ఈ–కుబేర్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్ని రకాల బిల్లులు ఈనెల 31లోగా చెల్లించా లని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని, పిల్లల చదువులు, వైద్యం తదితర అవసరాల కు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో అన్ని రకాల బిల్లులు వారం రోజుల లోపు చెల్లించే వారని, ఇప్పుడు సంవత్సరాలు గడిచినా చెల్లింపులు జరగడం లేదని ఒక ప్రకటనలో విమర్శించారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో శనివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపు రం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి సమస్యలతో పాటుగా సూచనలు సలహాలను ఉదయం 11.00 నుంచి 12.00 గంట ల వరకు 9959226050 నంబర్‌లో తెలియజేయాలని సూచించారు.
బచ్చన్నపేటలో వర్షం
జనగామ: కొద్ది రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడి పోతున్న ప్రజలకు చల్లని వర్షం కాసింత ఉపశమనం కలిగించింది. శుక్రవారం రాత్రి మండలంలో అరగంట పాటు కురిసిన వానతో వాతావరణం చల్లబడింది. ఎండుతు న్న వరి పంటకు స్వల్పంగా ఊపిరి పోసినట్ల యింది. మరో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పొట్టదశలో ఉన్న వరి గింజలు రాలిపోతాయని ఓ పక్క రైతులు ఆందోళన చెందుతుండగా.. నీటి తడి అవసరమ య్యే పంటలకు కొంత మేలు జరుగుతుందని మరికొంతమంది భావిస్తున్నారు.
‘యువ వికాస’ పథకానికి
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమాధికారి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ఈ పథకం ఉపయోగపడుతుందని, అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో obmms పోర్టల్ ద్వారా ఏప్రిల్ 5వ తేదీలోగా నమోదు చేసుకో వాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
సోమేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.14,79,121
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.14,79,121 వచ్చినట్లు ఈఓ మోహన్‌బాబు తెలిపారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఈనెల 21 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను శుక్రవారం ఆలయ కల్యాణ మండపంలో దేవా దాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు.