వైద్య నగర్‌లో వైఎస్సార్ సీపీలో చేరిన వారితో కన్నబాబు, చలమలశెట్టి సునీల్
వైఎస్సార్ సీపీకి జై
తుని, కాకినాడల్లో పలువురి చేరిక
తుని: టీడీపీ, జనసేన అధినేతల విధానాలు నచ్చక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఆకర్షితులైన పలువురు సోమవారం వైఎస్సార్ సీపీకి జై కొట్టారు. మండల కేంద్రమైన తొండంగిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సామాజిక వర్గానికి చెందిన పలువురు మహిళలు వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీ నాయకుడు, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు ఆధ్వర్యాన వచ్చిన వీరికి తుని మండలం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మంత్రి రాజా చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై వైఎస్సార్ సీపీలో చేరామని ఈ సందర్భంగా వారు అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ, తొండంగి మండలంలో ఒకప్పుడు టీడీపీకి పట్టు ఉండేదని, ప్రస్తుతం ఆ నాయకులపై అసంతృప్తి పెరగడంతో పాటు, వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాలపై నమ్మకం కలగడంతో పార్టీలో చేరికలు పెరుగుతున్నాయన్నారు. తమ పార్టీపై నమ్మకంతో వచ్చే అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
మళ్లీ వైఎస్సార్ సీపీదే విజయం
కాకినాడ రూరల్: ఎంత మంది కలిసి వచ్చినా మళ్లీ వైఎస్సార్ సీపీదే విజయమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. వారి సమక్షంలో జనసేన కీలన నాయకుడు, కాకినాడ ఒకటో డివిజన్ ఇన్‌చార్జి సానా వెంకటరాజు (శ్రీను), కాకినాడ పోర్టు లేబర్ కాంట్రాక్టర్లు కె.నాగేశ్వరరావు, ఒ.సింగుబాబు, ఎస్.సాయి నగేష్ రెడ్డి, వారి అనుచరులు, పలువురు మహిళలు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు. రమణయ్యపేటలోని వైద్య నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి కన్నబాబు, సునీల్ పార్టీ కండువాలు వేసి వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నబాబు మాట్లాడుతూ, పేదలు, ప్రజలతోనే తన పొత్తు అని చెబుతున్న సీఎం జగన్ మాటకు అనుగుణంగా అందరం ముందుకు సాగాలని, వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ, పొత్తుల విషయంలో తీవ్రంగా మోసపోయామనే ఆవేదనతో జనసేన శ్రేణులు భారీగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని, రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీలో మరింత భారీగా చేరికలు ఉంటాయని అన్నారు.
పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. అనంతరం తూరంగి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యాన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సమక్షంలో మహాలక్ష్మి నగర్‌కు చెందిన జనసేన నాయకులు కర్రి చిన్నా, తారుపిల్లి నాగు, రచ్చ వీరబాబు తదితర వంద మంది వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే, ఇదే గ్రామంలో మరోచోట వైఎస్సార్ సీపీ నాయకుడు కాకి రాజు ఆధ్వర్యాన పాతర్లపల్లి రవికుమార్, కాకినాడ అప్పారావు, మనోజ్ తదితర సుమారు 200 మంది టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కన్నబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment