
చినుకుతో కునుకు దూరం
రైతులకు అవగాహన
కల్పిస్తున్నాం
రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం. సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేశాం. రైతులు వరి నూర్పిడులు చేస్తే వర్షానికి తడవకుండా పాలిథిన్ బరకాలను కప్పాలి. పనలపై ఉన్న వరిని త్వరగా కుప్పలుగా వేయాలి. కోతలు కోసే రైతులు వాయిదా వేసుకోవాలి. రైతులు నష్టపోకుండా అవగాహన కల్పిస్తున్నాం.
– సుంకర బులిబాబు, ఏడీఈ, తుని
తుని: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అంది వచ్చే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు రైతులకు నిద్ర పట్టనివ్వడం లేదు. రైతులపై ప్రకృతి కన్నెర్ర జేసిందా అన్నట్టు దూసుకొస్తున్న వరుస తుపానులతో వ్యవసాయం సంక్షోభంలో పడుతోంది. జిల్లాలో గోదావరి డెల్టాలో ఇప్పటికే కోతలు, నూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు జరిగాయి. మెట్ట ప్రాంతంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో వర్షాలు ఆలస్యం కావడంతో వరి నాట్లు సకాలంలో వేయలేదు. దీంతో పంట పక్వానికి రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం పంట పనలపై ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట వర్షానికి తడిస్తే కోనే నాథుడు లేక పెట్టుబడి రాదని, ప్రయివేటు వ్యాపారుల నుంచి తెచ్చిన అప్పును చెల్లించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
తుని వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాల్లో ఖరీఫ్ సీజన్‌లో 14,266 హైక్టార్లలో వరి సాగు చేశారు. 6,437 హెక్టార్లలో కోతలు జరగగా, ఓపెన్ మార్కెట్‌లో 8,019 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం తుని, తొండంగి, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం మండలాల పరిధిలో 1,478 హైక్టార్లలో పంట పనలపై ఉంది. కుప్పల రూపంలో 13,252 మెట్రిక్ టన్నులు, కళ్లాలపై 573 మెట్రిక్ టన్నులు ఉంది. ప్రస్తుతం కురుస్తున్న స్వల్పపాటి వర్షాలతో ఇబ్బంది ఉండదని, భారీ వర్షాలు పడితే రైతులకు నష్టం తప్పదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులను నిలువునా ముంచింది. గత ప్రభుత్వం రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులను అందించింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. రైతులను పట్టించుకొనకపోగా ప్రస్తుతం తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయడం లేదు. మెట్టలో వరి ఒకే పంట పండుతుంది. అది కూడా వరుణుడు పుణ్యమాని తడిస్తే రైతులు నష్టపోతారు. వ్యవసాయ శాఖ అధికారులు సబ్ డివిజన్ పరిధిలోని మండలాలు, గ్రాామాల్లో పర్యటించి రైతులకు సూచనలు అందిస్తున్నారు.
˘ ధాన్యం తడిస్తే ధర తగ్గుతుంది
నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. తాండవ నీరు, వర్షాల వల్ల పంట బాగా పండింది. పంట పక్వానికి రావడంతో ఇటీవల కోత కోశాను. ఇందులో ఎకరం పంటను కుప్ప వేశాను. మరో మూడు ఎకరాలు పనలపై ఉంది. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో చినుకులు పడుతున్నాయి. ధాన్యం తడిస్తే ధర తగ్గిపోతుంది. నాలుగు ఎకరాలకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాను. గత ప్రభుత్వంలో రైతు భరోసా వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు.
–ఎల్లపు రామసూరి సత్యనారాయణ,
రైతు, బొద్దవరం
మెట్ట రైతుకు అల్పపీడనం కష్టాలు
పనలపై వరి పంట
ఒబ్బిడి చేసుకునే
ప్రయత్నంలో అన్నదాతలు
తుని సబ్ డివిజన్‌లో పరిధిలో..
మండలం వరి సాగు (హైక్టార్లలో) కోతలు అమ్మినది పనలపై కుప్పలుగా కళ్లాల్లో (మెట్రిక్ టన్నుల్లో)
తుని 2,939 776 26 55 4,600 0
తొండంగి 4,900 3,232 1,735 360 5,890 60
కోటనందూరు 3,907 1,127 135 800 1,658 455
రౌతులపూడి 1,855 795 73 205 453 58
శంఖవరం 665 507 50 58 651 0
మొత్తం 14,266 6,437 8,019 1,478 13,252 573

చినుకుతో కునుకు దూరం

చినుకుతో కునుకు దూరం
Comments
Please login to add a commentAdd a comment