
మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ
కాకినాడ సిటీ: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకినాడ జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు జనవరి 2, 2025 నుంచి కాకినాడలో ఉచిత శిక్షణ తరతులు ప్రారంభించనున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారిత అధికారి ఎం.సుబ్బారావు బుధవారం ప్రకటనలో తెలిపారు. స్టైఫండ్, బుక్స్ అలవెన్సు సౌకర్యాలు ఉన్నాయన్నారు. అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు వారి రెజ్యూమ్‌తో పాటు 10వ తరగతి, ఇంటర్, క్యాస్ట్, ఎస్‌జీటీ టెట్ క్వాలిఫై కాపీ, రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, సెల్ఫ్ అడ్రస్ కవర్, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయం, ప్రగతి భవనం, 2వ అంతస్థు, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఎదురుగా, కాకినాడ చిరునామాకు ఈ నెల 28వ తేదీ లోపు పంపాలి. వివరాలకు 0884–2379216 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
నేడు వర్గీకరణ
ఏకసభ్య కమిషన్ రాక
కాకినాడ సిటీ: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్‌మిశ్రా ఏక సభ్య కమిషన్ గురువారం కాకినాడ వస్తున్నందున ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, సాంఘిక సంక్షేమం, రెవెన్యూ పోలీస్ ఇతర శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనుందన్నారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులతో కమిషన్ సమావేశం అవుతుందని, అనంతరం 11 నుంచి 2 రెండు గంటల వరకు కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో వివిధ ఎస్సీ ఉపకులాల వర్గాల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరిస్తుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరిగే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా సమస్యలపై
పోరాటం చేయాలి
అమలాపురం రూరల్: దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు అరికట్టాలని సీపీఎం 14వ జిల్లా మహాసభలలో రాష్ట నాయకులు డిమాండ్ చేశారు. అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన ముగింపు సభలో ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో లక్ష మందికి పైబడి కౌలు రైతులు ఉంటే కనీసం సగం మందికి కూడా కౌలు రైతుకార్డులు మంజూరు చేయలేదన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంగా మారాయన్నారు. తరచూ సంభవిస్తున్న తుపానుల కారణంగా వర్షాలు కురవడంతో ధాన్యంతో తేమశాతం పెరుగుతోందన్నారు. దీంతో రైతులు బస్తాను రూ.300 నుంచి రూ.400 నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మహిళలపై దాడులు తగ్గడం లేదన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టమెంటులో అంబేడ్కర్‌ను ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గం ఎన్నిక
జిల్లా సీపీఎం పార్టీ ప్రథమ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్‌గా కారెం వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులుగా కె.కృష్ణవేణి, జి.డాక్టర్ చల్లా రవికమార్, డీవీ రావు, దుర్గాప్రసాద్, నూకల బలరాం, టి.నాగవరలక్ష్మి, ఎస్.జోగేష్, డీఏ లక్ష్మి ఎంపికయ్యారు.

మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment