సర్కారుకు బుద్ధి
చెప్పేందుకు సిద్ధం
అధికార పార్టీ బెదిరించినా, ప్రలోభపెట్టినా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న ఉద్యోగులు, నిరుద్యోగులు వినే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఎంతైనా ఖర్చు చేసి నిరుద్యోగులతో పాటు ఉద్యోగుల ఓట్లను కొనుగోలు చేసేందుకు సర్కార్ వ్యూహం రచించింది. అయినప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులును గెలిపించి, సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి, వంచించిన కూటమి సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో పాటు పట్టభద్ర ఓటర్లందరూ సిద్ధంగా ఉన్నారు.
– సత్తిరాజు, ఏపీ పెన్షనర్ల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రజలను నమ్ముకున్నారు
టీడీపీ అభ్యర్థి పచ్చ పార్టీ కేడర్‌ను నమ్ముకుంటే పీడీఎఫ్ అభ్యర్థి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాలు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పట్టభద్రులతో పాటు ప్రజలను నమ్ముకున్నారు. వీరందరి మద్దతుతో విజయం సాధిస్తారు. ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ తుంగలో తొక్కడంతో ఇప్పుడు అన్ని వర్గాల మద్దతూ పీడీఎఫ్ అభ్యర్థికి లభిస్తోంది. ఇప్పటికే ప్రలోభాలతో ఎన్నికల్లో నెగ్గేందుకు సర్కార్ పార్టీ కేడర్‌తో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
– డి.శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
సర్కారుకు బుద్ధి
Comments
Please login to add a commentAdd a comment