చిరుద్యోగులపై కూటమి కక్ష
కూటమి ప్రభుత్వం చిరుద్యోగులపై కక్ష కట్టింది. చిన్న స్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ ఎటువంటి సమస్యా పరిష్కారం కాలేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పాత చార్జీలతోనే మెనూ అమలు చేస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందని పరిస్థితి. అంగన్‌వాడీలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కూటమి సర్కార్‌పై ఉన్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలే పోరాడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులు విజయానికి కృషి చేస్తున్నాం.
– ఇ.చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment