ఖాళీగా ఉన్నప్పుడు కొట్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఖాళీ చేయాలని అంటే అన్యాయం జరిగిందని అంటే ఎలా? రెండు లక్షల మంది ప్రజలకు అవసరమైన రోడ్డు ఇది. దీనిని ఒకరి తరువాత ఒకరు ఆక్రమించి కొట్లు ఏర్పాటు చేసేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఖాళీ చేయమంటున్నాం. దీని మీద ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండదు. అధికారులుగా కేవలం ప్రజల సౌకర్యం కోసం రోడ్డు ఖాళీ చేయించడం మా బాధ్యాత కాబట్టి చేయిస్తున్నాం. ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలి. లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించక తప్పదు.
– ఎన్.కనకారావు, మున్సిపల్ కమిషనర్, పిఠాపురం
Comments
Please login to add a commentAdd a comment