
చిరు వ్యాపారులపై కొరడా
●
● పాడా కార్యాలయం ఏర్పాటు కోసం
హడావుడి
● దుకాణాలు ఖాళీ చేయాలని
అధికారుల హుకుం
● జీవనోపాధి పోతోందని
బాధితుల ఆందోళన
పిఠాపురం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అధికార యంత్రాంగం తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యాలయాన్ని పిఠాపురం మున్సిపల్ అతిథి గృహం సమీపాన ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్క చిరు వ్యాపాలు చేసుకుంటున్న వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. రెండు రోజుల్లో షాపులు ఖాళీ చేయాలని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొడితే ఎలాగని, హఠాత్తుగా వ్యాపారాలు ఖాళీ చేయాలని అంటే తమ జీవనాధారాలు పోతాయని చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము వీధుల పాలవుతామని, తమను ఆదుకోవాలని వారు మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. అయినప్పటికీ షాపులు ఖాళీ చేయాల్సిందేనని అధికారులు చెబుతూండటంపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వాల్లో లేని ఇబ్బంది ఇప్పుడెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పాడా అంటే అభివృద్ధి చేసేదిగా ఉండాలి తప్ప తమ ఉపాధి దెబ్బ తీసేదిగా ఉంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. పేదల పొట్ట కొడుతూంటే, తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎలా ఊరుకుంటున్నారని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment