
కలెక్టరేట్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను గురువారం రాత్రి కాకినాడ తరలించారు. కలెక్టరేట్‌లోని వివేకానంద హాలులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో వీటిని భద్రపరుస్తున్నట్లు సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ జె.వెంకటరావు తెలిపారు. ఆయా కేంద్రాల నుంచి సిబ్బంది తీసుకువస్తున్న పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను, ఇతర ఏర్పాట్లను ఆయన, కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పర్యవేక్షించారు.
ఇంధన వనరులను సంరక్షించుకోవాలి
కాకినాడ రూరల్: సంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించుకునేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా సాక్ష్యం పేరిట ఓఎన్‌జీసీ చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం వాకథాన్ నిర్వహించారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో ఓఎన్‌జీసీ హెచ్‌టీపీ కార్యాలయం వద్ద సాక్ష్యం కార్యక్రమ చీఫ్ కో ఆర్డినేటర్ వాసుదేవన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులుగా ఈస్ట్రన్ షోర్ అసెట్ ఈడీ రత్నేష్ కుమార్, ఈడీలు ప్రభల్‌సేన్ గుప్తా, అనుపమ్ సక్సేనా హాజరయ్యారు. వారికి కో ఆర్టినేటర్ మహ్మద్ రఫీ స్వాగతం పలికారు. వాకథాన్ కార్యక్రమాన్ని ఈడీ రత్నేష్ కుమార్ ప్రారంభించి, సంప్రదాయ ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. బెలూన్లు గాలిలోకి వదిలి వాకథాన్‌ను ప్రారంభించారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ నుంచి సర్పవరం జంక్షన్, బోట్‌క్లబ్ మీదుగా తిరిగి రమణయ్యపేట వరకూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టరేట్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

కలెక్టరేట్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
Comments
Please login to add a commentAdd a comment