
విద్యుదాఘాతంతో రైతు మృతి
పిఠాపురం: మండలంలోని మాదాపురంలో విద్యుదాఘాతానికి గురై రైతు చిన్నారి సత్యనారాయణ(65) సోమవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు, పశువులకు మేతకు పొలం నుంచి గడ్డి కోసుకొస్తుండగా, కిందకు వేలాడుతున్న కరెంట్ వైరు తగిలి అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గట్టుపై 11 కేవీ వైరు నాలుగు అడుగుల ఎత్తులో అతడికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు మృతుని బంధువులు ఆరోపించారు. మృతుడి కుమారుడు పొలంలో సత్యనారాయణ మృతదేహాన్ని చూసి, బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని మృతుని బంధువులు ఆరోపించారు. పిఠాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment