
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
తాడ్వాయి మండలంలో..
తాడ్వాయి (ఎల్లారెడ్డి): మండలంలోని కాళోజివాడిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మల్లమారి రాకేష్ (25)కు ఐదేళ్ల క్రితం రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమారుడు అనూష్ ఉన్నాడు. రెండేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఇటీవల సంధ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి రాకేష్ తీవ్ర మనస్థాపంతో బాధపడుతుండేవాడు. కాగా సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గల వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ ప్రాంతంలో అబ్దుల్ సలాం (37) నివసిస్తుండేవాడు. అతడి భార్య ఏడాది క్రితం మృతిచెందడంతో ఆమె తల్లితరపువారు సలాంపై కేసు వేశారు. దీంతో సలాం జైలుకు వెళ్లగా ఇటీవల బయటకు వచ్చాడు. తన పిల్లలను చూడడానికి అత్తగారింటికి వెళ్లిన సలాంను వారు అడ్డుకోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో సలాం వాట్సప్ స్టేటస్ పెట్టి, నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వర్ని మండలంలో..
వర్ని: మండలంలోని చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. చందూర్ గ్రామానికి చెందిన అర్కల గోపాల్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులు భరించలేక సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముప్కాల్ మండలంలో..
బాల్కొండ: ముప్కాల్ మండలంలో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నా గంపేట్ గ్రామానికి చెందిన ఏ లేటి గంగాధర్ అలియాస్ వకీ ల్ (49) కొంతకాలంగా తనకు ఎవరో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మానసికంగా బాధపడుతున్నాడు. మానసిక ప్రశాంతత కోసం ఈనెల 15న గ్రామస్తులతో కలిసి తిరుపతిలో శ్రీవారి సేవ చేయుటకు వెళ్లాడు. గంగాధర్ నిత్యం కల్లు తాగే అలవాటు ఉంది. తిరుపతిలో కల్లు లభించకపోవడంతో మానసిక ఆందోళనకు గురై ఆదివారం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో పురుగులమందు తాగాడు. అనంతరం కొత్తపల్లికి గ్రామంలో ఓ ఇంటి వద్ద నీరు తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆర్మూర్‌లోని ఓ ప్రయివేలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య