అతివల ఆరోగ్యానికి రక్ష | - | Sakshi
Sakshi News home page

అతివల ఆరోగ్యానికి రక్ష

Published Fri, Jan 31 2025 1:53 AM | Last Updated on Fri, Jan 31 2025 1:53 AM

అతివల

అతివల ఆరోగ్యానికి రక్ష

● ‘ఆరోగ్య మహిళ’తో ప్రత్యేక దృష్టి ● అన్ని ఆస్పత్రుల్లో క్యాంపులు ● 22 నెలల్లో 67,925 మందికి వైద్య పరీక్షలు ● కలెక్టర్‌ చొరవతో కాలనీలకు చేరిన సేవలు

కరీంనగర్‌టౌన్‌: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్య మహిళ అనే ప్రత్యేక కార్యక్రమానికి 2023 మార్చి 8న శ్రీకారం చుట్టింది. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది రకాల సర్వీస్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు వైద్యం అందిస్తున్నారు. 22 నెలల్లోనే 67,925 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షలు ఇవీ..

ప్రస్తుతం అత్యధిక మంది మహిళలు కేన్సర్‌, ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేన్సర్‌కు సంబంధించిన పరీక్షలపై దృష్టి సారించారు. గర్భాశయం, కేన్సర్‌ స్క్రీనింగ్‌, థైరాయిడ్‌, సూక్ష్మపోషక లోపాలు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, సంతానలేమి, మెనోపాజ్‌ నిర్వహణ, లైంగిక వ్యాధులు, శరీర బరువు నిర్వహణ వంటి వాటికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. కేన్సర్‌ బాధితులకు జిల్లా ప్రధానాసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, వైద్యపరీక్షలన్నీ టీ– హబ్‌లో చేస్తున్నారు.

కలెక్టర్‌ చొరవతో..

మహిళల ఆరోగ్యంపై కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్య మహిళ కింద జిల్లాలో తొమ్మిది ఆస్పత్రులను ఎంపిక చేయగా, కలెక్టర్‌ చొరవతో అన్ని ఆస్పత్రుల్లో ప్రతీ మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలు ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కాలనీలకు వెళ్లి క్యాంపులు నిర్వహిస్తున్నారు. దీంతో మహిళలు పెద్దసంఖ్యలో శిబిరాలకు హాజరై పరీక్షలు చేయించుకుంటున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళలకు వైద్య పరంగా ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కాలనీలకు వెళ్లి అక్కడే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలున్న మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
అతివల ఆరోగ్యానికి రక్ష1
1/2

అతివల ఆరోగ్యానికి రక్ష

అతివల ఆరోగ్యానికి రక్ష2
2/2

అతివల ఆరోగ్యానికి రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement