‘420 హామీలకు 420 రోజులు’
కరీంనగర్: 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా 420 రోజులు గడిపేసిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ.రామకృష్ణారావు విమర్శించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం కరీంనగర్ కోతిరాంపూర్‌లోని బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించి, వినతిపత్రం అందించారు. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. పథకాల పేర్లకు కొదవలేదు.. ఆచరణలో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. 420 హామీల పుణ్యాన 410 మంది రైతులు, 100 మంది ఆటోడ్రైవర్లు 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోగా.. 55 మంది గురుకుల విద్యార్థులు సర్కారు నిర్లక్ష్య పాలనలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులిచ్చామని తెలిపారు. హామీలన్నీ అమలు చేసేవరకూ బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్, బీఆర్‌ఎస్ కరీంనగర్‌రూరల్ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, మైనార్టీ నగర శాఖ అధ్యక్షుడు షౌకత్, బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment