తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌

Published Fri, Jan 31 2025 1:53 AM | Last Updated on Fri, Jan 31 2025 1:53 AM

తొలిస

తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌

● టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి ● గంజ్‌లో పనులు పరిశీలన

కొత్తపల్లి(కరీంనగర్‌): స్మార్ట్‌సిటీలో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్‌లోని గంజ్‌ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌, కాంపాక్ట్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నిర్మిస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు. 33/11 కేవీ టవర్‌ సర్కిల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని గంజ్‌ ఏరియాలో సంబంధిత పనులను గురువారం ఆయన పరిశీలించారు. రద్దీగా ఉండే తెలంగాణచౌక్‌, మంచిర్యాల చౌరస్తా, డీఎఫ్‌వో ఆఫీసు, కోర్టు చౌరస్తా తదితర ప్రదేశాల్లో జిగ్‌జాగ్‌గా ఉన్న విద్యుత్‌ లైన్లను అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఈ రమేశ్‌బాబు, డీఈటీ ఉపేందర్‌, టౌన్‌ డీఈ రాజం, టౌన్‌–1 ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్‌, టౌన్‌–5 ఏఈ నజియా జాబీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బాలసదన్‌, శిశుగృహ సందర్శన

కరీంనగర్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వెంకటేశ్‌ గురువారం కరీంనగర్‌లోని బాలసదన్‌, శిశుగృహలను సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. కష్టపడి చదువుకొని, ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, ఎప్పుడూ నిజమే మాట్లాడాలని సూచించారు. బాలసదన్‌, శిశుగృహలలో వంట, ఆహార పదార్థాలను నిల్వ చేసే గదులను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లల ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి న్యాయసేవ అవసరమైనా సంప్రదించాలని నిర్వాహకులకు చెప్పారు. కార్యక్రమంలో లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మహేశ్‌, బాలసదన్‌, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.

స్మార్ట్‌సిటీ పనులు ఫిబ్రవరిలో పూర్తవ్వాలి

నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో స్మార్ట్‌సిటీ పెండింగ్‌ పనులు ఫిబ్రవరిలో పూర్తవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీఎంసీ, ఇంజినీరింగ్‌ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మార్ట్‌సిటీలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌, ఫ్రీ వైఫై, సీసీ కెమెరాలు, పాఠశాలల ఆధునీకరణ, టవర్‌ సర్కిల్‌ ఆధునీకరణ, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, సెంట్రల్‌ లైబ్రరీ భవనం, బాలసదనం భవన్‌, జీబ్రా క్రాసింగ్‌, కశ్మీర్‌ గడ్డ సమీకృత మార్కెట్‌ తదితర ప్రాజెక్టులపై చర్చించారు. వాటి పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. స్మార్ట్‌సిటీ పనులకు మార్చి వరకు గడువు ఉన్నా ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలని సూచించారు. నగరంలో వైఫై సేవలను తనిఖీ చేయాలన్నారు. కొత్త ప్రాంతాల్లోనూ ఫ్రీవైఫై ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో ఇన్‌స్టాల్‌ చేయాలని, నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్య క్రమంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ యాదగిరి, డీఈలు వెంకటేశ్వర్లు, అయూబ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,150

జమ్మికుంట(హుజూరాబాద్‌): జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో గురువారం క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.7,150 పలికింది. మోడల్‌ ధర రూ.7 వేలు, కనిష్ట ధర రూ.6,900కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న, కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌1
1/2

తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌

తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌2
2/2

తొలిసారి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement