కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. సీడీఎంఏ ఆదేశాల మేరకు కమిటీలను నియమిస్తూ నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రిజర్వాయర్ల వారిగా ఈ కమిటీలు పనిచేస్తాయి. ప్రతీ రిజర్వాయర్‌కు సంబంధిత ఈఈ, డీఈ, ఏఈ, ఇన్‌చార్జి ఫిట్టర్, లైన్‌మెన్లతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్‌ఈ పర్యవేక్షణ చేస్తుంటారు. నగరంలో ఎక్కడైనా తాగునీటి సరఫరాలో సమస్యల తలెత్తితే, ఆ రిజర్వాయర్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ వెంటనే వెళ్లి ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ కమిటీకి సంబంధిత డివిజన్ వార్డు అధికారి, పారిశుధ్య కార్మికులు సహకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment