35,562 మంది.. 58 కేంద్రాలు
విజయీభవ
● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ● ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు
కరీంనగర్:
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాటు ్లపూరి ్తచేశారు. ఈనెల 5 నుంచి 22 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ప్రథమ 17,799.. ద్వితీయ 17,763..
జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో 58 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 35,562 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 17,799, ద్వితీయ సంవత్సరం 17,763 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తపాలాశాఖ ద్వారా ఇంటర్ బోర్డుకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
పర్యవేక్షణకు బృందాలు
ఇంటర్ పరీక్షలను నిరంతరం పర్యవేక్షించేలా నాలుగు సిట్టింగ్ స్క్వాడ్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున 58 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు. మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఐదు నిమిషాలు అనుమతి
ప్రభుత్వ కళాశాలలు 11, మోడల్ కళాశాలలు 2, సోషల్ వెల్ఫేర్ 1, మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు 5, ఎంజేపీ జూనియర్ కళాశాలలు1, ప్రైవేట్ కాలేజీలు 38 మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఒక గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తారు.
ఇలా చేస్తే ఫలితాలు మీవే..
● పరీక్షలయ్యే వరకు మార్కులపై తల్లిదండ్రులు, హాస్టళ్లలో వార్డెన్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్ల శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు.
● రాత్రి 10.30 గంటల తర్వాత చదవకూడదు.
● వేకువజామున క్లిష్టమైన సబ్జెక్టులు, తేలికై నవి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చదవాలి.
● తల్లిదండ్రులు తమ పిల్లలను టీవీలు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఇతర పనులేవీ అప్పగించకూడదు.
● పిల్లలకు మాంసాహారం కంటే తేలికగా జీర్ణమయ్యే శాకాహారానికే ప్రాధాన్యమివ్వాలి. ఉదయం పూట నూనె లేని అల్పాహారం ఇవ్వడం మంచిది.
● పరీక్ష రాశాక ఎన్ని మార్కులొస్తాయని అడగకూడదు. అడిగితే దాని ప్రభావం తర్వాత పరీక్షలపై పడుతుంది.
● రోజూ ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది.
● నేను బాగా రాయగలను. నాకు భయం లేదు. మంచి మార్కులొస్తాయి.. అని మనసులో అనుకుంటూ సానుకూల దృక్పథంతో ఉండాలి.
● పరీక్షలకు బయల్దేరడానికి గంట ముందుగానే అన్నీ సర్దుకోవాలి. హడావిడిగా వెళ్తే ఆ ప్రభావం పరీక్షపై పడుతుంది.
● తొలుత హాల్‌టికెట్ నంబరు వేయాలి. ప్రశ్నాపత్రం చూశాక వచ్చిన సమాధానాలకు 1,2,3 ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. సమయాన్ని అన్నింటికీ పంచుకుని, అఖరులో అన్నీ రాశానో లేదో చూసుకోవాలి.
ఇబ్బందులు కలగకుండా చూస్తాం
ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షా సమయంలో కేంద్రాల వద్ద144 సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థులకు హాల్‌టికెట్లపై ఆందోళన అవసరం లేదు. నేరుగా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలుంటే వాటిని మాదృష్టికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ 0878–2933006 నంబర్ కేటాయించాం. నిర్ణీత గడువు తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించం.
– జగన్మోహన్‌రెడ్డి, డీఐఈవో
●
35,562 మంది.. 58 కేంద్రాలు
35,562 మంది.. 58 కేంద్రాలు
Comments
Please login to add a commentAdd a comment