మానవ అభివృద్ధి సైన్స్‌తో ముడిపడి ఉంది
కరీంనగర్ సిటీ: మానవ అభివృద్ధి సైన్స్‌తో ముడిపడి ఉందని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో సైన్స్ కళాశాల, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైదరాబాద్ సహకారంతో నేషనల్ సైన్స్‌డేను ప్రిన్సిపాల్ జయంతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా వీసీ ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రా ర్ జాస్తి రవికుమార్, సంజీవరెడ్డి, దిగంబర్‌రావు, సాయిని కిరణ్ హాజరయ్యారు. ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నిత్యజీవితంలో సైన్స్ ముఖ్య భూమికగా మారిందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సంజీవరెడ్డి మా ట్లాడుతూ సర్ సీవీ.రామన్ జీవిత చరిత్రను వివరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందజేశారు. రసాయనశాస్త్ర విభాగాధిపతి నమత, సరసీజ, మూర్తి, రాజు, విజయ్‌కుమార్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి జోసెఫ్ పాల్గొన్నారు.
ఘనంగా లైన్‌మెన్ దినోత్సవం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌టౌన్ డివిజన్‌లోని టౌన్ 5 సెక్షన్ టవర్ సర్కిల్, సప్తగిరికాలనీల్లో మంగళవారం లైన్‌మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యవేక్షక ఇంజినీరు మేక రమేశ్‌బాబు మాట్లాడుతూ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్‌మెన్లకు అభినందనలు తెలియజేశారు. నిత్యం నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్ సరఫరా అందించేందుకు, పంపిణీ లైన్లు, ఉపకరణాలను నిర్వహించేందుకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, అత్యవసర సేవలకు స్పందించేందుకు, బిల్లింగ్, వసూళ్లు చేపట్టేందుకు, వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు లైన్‌మెన్లు చేస్తున్న అంకితభావ సేవ ప్రశంసనీయమన్నారు. డీఈ టెక్నికల్ కే.ఉపేందర్, డీఈ ఆపరేషన్ జే.రాజం, లావణ్య, పంజాల శ్రీనివాస్‌గౌడ్, మల్లయ్య పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్: గిరిజన సంక్షేమశాఖ అర్హత గల గిరి జన విద్యార్థుల నుంచి 2025–26 సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్దన్ ఒక ప్రకటనలో తెలి పారు. గిరిజన సంక్షేమశాఖ అర్హత గల విద్యార్థులకు వాటర్‌స్పోర్ట్స్ అకాడమీ బోయిన్‌పల్లి హైదరాబాద్, మోడల్ స్పోర్ట్స్ పాఠశాల జాతర్ల బాలుర(ఆదిలాబాద్, కిన్నెరసాని బాలుర(బీడీ కొత్తగూడెం), ఉట్నూర్ బాలుర(ఆదిలాబాద్), కొత్తగూడ బాలుర(మహబూబాబాద్ జిల్లా), ఆసిఫాబాద్ బాలికలు((కేబీ.ఆసిఫాబాద్ జిల్లా), కాచనపల్లి బాలికలు(బీడీ కొత్తగూడెం) పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గిరిజన బాలబాలికలు తమ దరఖాస్తులను కరీంనగర్ జిల్లా గిరి జన అభివృద్ధి అధికారి కార్యాలయ పనివేళలలో సమర్పించాలని తెలిపారు. విద్యార్థుల వయస్సు 31 ఆగస్టు 2025 నాటికి 9నుంచి 11 సంవత్సరాల లోపు కలిగి ఉండాలని తెలిపా రు. ఈ ఎంపిక జిల్లాస్థాయి కమిటీ ద్వారా దేహదారుఢ్య పరీక్షల అనంతరం ఎంపిక చేయబడునని పేర్కొన్నారు. జిల్లాలో ఈనెల 12 నుంచి 16 వరకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. వివరాలకు 8686451313 నంబర్‌ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
డీజేలపై నిషేధాజ్ఞలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధి లో డీజేల వినియోగంపై నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రోన్ల వాడకంపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత ఏసీపీల ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయం తనిఖీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాన్ని ఐజీ బుద్ధప్రకాశ్ జ్యోతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలు విభాగాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రవీందర్, జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
మానవ అభివృద్ధి సైన్స్‌తో ముడిపడి ఉంది
Comments
Please login to add a commentAdd a comment