నేరం చేస్తే.. తప్పించుకోలేరు
● కేసుల్లో పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
● జగిత్యాల జిల్లాలో వరుస తీర్పులు
● జైలుకు వెళ్తున్న నేరస్తులు
జగిత్యాల క్రైం: నేరం చేసినవారు ప్రస్తుతం తప్పించుకునే పరిస్థితి లేదు. నమోదైన కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. దీంతో జగిత్యాల జిల్లాలో నేరాలు చేసినవారికి న్యాయస్థానంలో వరుసగా శిక్షలు పడుతున్నాయి. నేరం చిన్నదైనా.. పెద్దదైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇతర దేశాలకు పారిపోదామనుకుంటే పొరపాటే. ప్రపంచంలో ఎక్కడున్నా పోలీసులు పట్టుకొస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, పౌరులు బాధ్యతగా ఉండాలని ఇటీవలి పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
పరిస్థితి మారిపోయింది..
గతంలో నేరం జరిగితే దాన్ని చూసినవాళ్లు వచ్చి, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చేది. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. సంఘటనలపై కేసులు నమోదైతే నిందితుల ఫోన్ లొకేషన్, సదరు ఏరియాల్లో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్, డాగ్‌స్క్వాడ్ వంటి వాటిని వినియోగిస్తూ సరైన సాక్ష్యాలు సేకరించి, చార్జిషీట్‌లో పొందుపరుస్తుండటంతో కేసులకు బలం చేకూరి, నేరస్తులకు తగిన శిక్ష పడుతోంది.
ఉన్నతాధికారుల దిశానిర్దేశం..
నేరం జరిగిన వెంటనే ఎస్‌ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలు, పక్కాగా సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి, నేరాన్ని నిరూపిస్తే 100 శాతం శిక్ష పడుతుందని పోలీసులు చెబుతున్నారు. కేసుల నమోదు, విచారణలో నాణ్యత పాటించాలని, సాంకేతికతను వినియోగించాలని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
శిక్ష పడిన నేరస్తుల వివరాలు
శిక్ష 2022 2023 2024 2025
జీవితకాలం 2 14 10 1 5–10 ఏళ్లు 2 2 11 2 3–5 ఏళ్లు 3 6 3 3 1–3 ఏళ్లు 9 20 12 1 ఏడాదిలోపు 44 13 26 0 మొత్తం 60 55 62 7
తప్పు చేస్తే శిక్ష తప్పదు
తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడుతుంది. నేరాన్ని పరిగణలోకి తీసుకొని, దాని కి తగినట్లుగా న్యాయస్థానం శిక్ష వేస్తుంది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బ ందిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడ్డాయి.
– అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ, జగిత్యాల
నేరం చేస్తే.. తప్పించుకోలేరు
Comments
Please login to add a commentAdd a comment