● విద్యార్థిని పరామర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: నగరంలోని మంకమ్మతోట ధన్గర్‌వా డీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కోతి వస్తుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూకిన బాలుడిని కలెక్టర్ పమేలా సత్పతి గురువారం పరామర్శించారు. 8వ తరగతి విద్యార్థి రఘువర్ధన్ కొద్దిరోజుల క్రితం పాఠశాలలో కోతి రావడంతో భయంతో మొదటి అంతస్తు నుంచి దూ కాడు. దీంతో అతడి కాలి ఎముకలు విరిగాయి. కొద్దిరోజులు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందాడు. కలెక్టర్ పమేలా సత్పతి బాలుడిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కరీంనగర్‌లో మెరుగైన చికిత్స ఇప్పిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘువర్ధన్‌ను గురువారం పరామర్శించారు. భయం వీడాలని, బాగా చదువుకోవాలని సూచించారు. అవసరమైన పుస్తకా లు తెప్పిస్తానని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న క్రిటికల్ కేర్ విభాగాన్ని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీనా ఉన్నారు.
కంగ్రాట్స్.. మేడమ్
కరీంనగర్ అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన కలెక్టర్ పమేలా సత్పతిని టీఎన్జీవో, టీజీవోలు కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో కలిసి ప్రశంసించారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్ గౌడ్, మహిళా నాయకులు శారద, సబితా, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్‌సింగ్, సందీప్, కరుణాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment